తెలంగాణ రైతులకు కీలక సమాచారం. నేటి నుంచి 3 ఎకరాలలోపు భూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. ఇప్పటి వరకు 2 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ నిధులు అందించగా, ఇకపై 3 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతులు ఈ పథకం ప్రయోజనాన్ని పొందనున్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా నిధుల విడుదల ఆలస్యం అయ్యిందని విమర్శలు వచ్చినప్పటికీ, ఇప్పుడు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. గతంలో కేసీఆర్ సర్కార్ ఎకరాకు రూ.10,000 ఇచ్చినప్పటికీ, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ మొత్తం రూ.12,000కి పెంచిన సంగతి గమనార్హం.

