జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మతల్లి బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. బోనాల సందర్భంగా గ్రామంలోని ముదిరాజ్ కులస్తులు ర్యాలీగా వెళ్లి పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కల్నల్ బిక్షపతి, పాలకుర్తి ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు దాసరి మధు, తాజా మాజీ ఉప సర్పంచ్ తరాల చంద్రబాబు, డైరెక్టర్లు దేశబోయిన అశోక్, దేశబోయిన సోమన్న, సోమల్లు, శ్రీనివాస్, నిరంజన్, యాకయ్య, మాజీ స్కూల్ యాజమాన్య కమిటీ చైర్మన్ జీడి సమ్మయ్య, మాజీ ఎంపీటీసీ దాసరి యకయ్య, జీడి మధు, పెండ్యాల రాములు, మామిండ్ల యాకయ్య తదితరులు పాల్గొన్నారు.



