Saturday, October 3, 2026
25.8 C
Hyderabad

ఆగస్టు19, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం
దక్షిణాయణం-వర్షఋతువు
శ్రావణమాసం శుక్లపక్షం
తిధి శు.సప్తమి రాత్రి 08.09 వరకు
ఉపరి అష్టమి
నక్షత్రం స్వాతి ఉదయం 08.58 వరకు
ఉపరి విశాఖ
యోగం శుక్ల ఉదయం 06.37 వరకు
ఉపరి బ్రహ్మ
కరణం గరజి ఉదయం 07.43 వరకు
ఉపరి వణజి
రాహుకాలం పగలు 12.00 నుండి
01.30 వరకు
దుర్ముహూర్తం ఉదయం 11.34 నుండి
12.24 వరకు
వర్జ్యం పగలు 03.03 నుండి 04.46
వరకు
సూర్యోదయం ఉదయం 05.58
సూర్యాస్తమయం సాయంత్రం 06.44

మేష రాశి:
మీకు అనుకూలమైన రోజు. ముఖ్యమైన పనుల్లో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

వృషభ రాశి:
కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి కనిపిస్తుంది. అనుకోని ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం.

మిథున రాశి:
కొత్త విషయాలు తెలుసుకోవడానికి అనుకూలమైన రోజు. మీ ఆలోచనలు ఇతరులను ఆకట్టుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ప్రయాణాల విషయంలో స్వల్ప ఇబ్బందులు ఉండవచ్చు.

కర్కాటక రాశి:
కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త అందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

సింహ రాశి:
మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే రోజు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపట్టవచ్చు. వ్యాపారస్తులకు లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. కోపాన్ని తగ్గించుకుని మాట్లాడటం మంచిది.

కన్య రాశి:
ఆలోచించి చేసే ప్రతి పని మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది.

తుల రాశి:
స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది.

వృశ్చిక రాశి:
ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబంలో చిన్నపాటి అపార్థాలు రావచ్చు, ప్రశాంతంగా పరిష్కరించుకోండి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

ధనుస్సు రాశి:
శుభకార్యాలకు సంబంధించిన ఆలోచనలు ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారికి అనుకూలమైన సూచనలు కనిపిస్తాయి. ధన వ్యవహారాల్లో లాభం కలిగే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

మకర రాశి:
కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఉన్నతాధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబ అవసరాల కోసం కొంత ఖర్చు చేయాల్సి రావచ్చు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకండి.

కుంభ రాశి:
కొత్త ప్రణాళికలకు శ్రీకారం చుడతారు. వ్యాపారస్తులకు మంచి ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడుపుతారు.

మీన రాశి:
మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపడకుండా పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. దైవభక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు.

Latest News

గాంధీజీకి గుడి..ఎక్కడో మరి!?|ADUGU TRENDS

దేవుల్లకు గుడి కట్టటం మన సంప్రదాయం. మనుసుల్లో మహానుభావులకు కూడా గుడి కట్టడం సూత్తున్నం. కాకాపోతే మనుసుల్లో మహానుభావులు తక్కువ. గవాల్లకు గుడి కట్టుడు కూడా శాలా తక్కువే. గట్లనే గాంధీజీకి కూడా...

కాలుష్య కోరల్లో ఢిల్లీ.. ఇంకెన్నాళ్లు ఈ నరకం!?|EDITORIAL

ఉదయం కళ్లుతెరిస్తే పొగమంచు.. బయటకు వస్తే విషగాలి.. ఇదేనా దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి? కాలుష్యం పెరిగిన ప్రతిసారీ కొత్త ఆంక్షలు.. కొత్త ప్రకటనలు.. కానీ శాశ్వత పరిష్కారం మాత్రం ఎక్కడా కనిపించదు....

అక్టోబర్ 03, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి సప్తమి ఉదయం 09.50 వరకు ఉపరి అష్టమి నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి పునర్వసు యోగం వరీయాన్ రాత్రి 06.49 వరకు ఉపరి పరిఘ కరణం బవ ఉదయం 09.50...

గురువుకు పూర్వ విద్యార్థుల అపూర్వ కానుక!?|ADUGU TRENDS

గురువంటే విద్యా బుద్ధులు నేర్పేవాడే కాదు. జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేవాడు. భావి భారతానికి బాటలు వేసే వాడు. గిట్లనే సదువుకుని ఎదిగిన, గీ ముచ్చట ఎరిగిన గా సదువుకున్న పొల్లగాండ్లు గా సారును...

జయహో స్మిత్ మచ్చర్…ధైర్యానికి సెల్యూట్!|EDITORIAL

ఆకాశంలో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయనుకున్న క్షణం.. ఓ కెప్టెన్‌ అసమాన ధైర్యం వందల ప్రాణాలకు రక్షణ కవచమైంది! తీవ్ర గాయాలు.. కాక్‌పిట్‌లో దాడి.. అదుపుతప్పుతున్న విమానం.. అయినా వెనుకడుగు వేయని స్మిత్ మచ్చర్!...

అక్టోబర్ 02, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి షష్ఠి పగలు 12.13 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రోహిణి ఉదయం 07.20 వరకు ఉపరి మృగశిర యోగం వ్యతీపాత రాత్రి 09.54 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి పగలు 12.13 వరకు ఉపరి...

పాలిచ్చే ఏటీఎం!?|ADUGU TRENDS

అవుమల్ల.. గిప్పటిదాకా పైసలిచ్చే ఏటీఎంను సూసినం. గట్లనే టికెట్లనిచ్చే ఏటీఎంలను గూడ సూసినం. కానీ, గీ పాలిచ్చే ఏటీఎంను ఎక్కడైనా సూసినమా? కానీ, గా సిద్దిపేట జిల్ల గజ్వేల్ ఒకాయినె గీ పాల...

డ్రాగన్ తో గగనతల చర్చలు సఫలమయ్యేనా!?|EDITORIAL

భౌగోళిక రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువుల కంటే శాశ్వత ప్రయోజనాలే కీలకం. భారత్–చైనా సంబంధాల్లోనూ అదే వాస్తవికత పనిచేయాలి. విమానాలకు గగనతలం లభించడం తక్షణ ప్రయోజనం కావచ్చు. కానీ, రెండు దేశాల...

అక్టోబర్ 01, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి పంచమి పగలు 02.30 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం కృత్తిక ఉదయం 08.50 వరకు ఉపరి రోహిణి యోగం సిద్ది రాత్రి 12.57 వరకు ఉపరి వ్యతీపాత కరణం తైతుల పగలు 02.30 వరకు ఉపరి...

అమ్మకానికో ఊరు..! నీల్లిత్తే సాలు!?|ADUGU TRENDS

ఇప్పటిదాకా వస్తువులమ్మడం సూసినం. ఆస్తులనమ్మడం సూసినం. కానీ, ఊరినే అమ్మకానికి పెట్టడం ఎక్కడైనా సూసినమా? కానీ, గా ఊరును నిజంగనే గా ఊరోల్లు అమ్మకానికి పెట్టిండ్రు. గది కూడా వట్టి నీల్లకే!? గది మహారాష్ట్ర....

ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించడమే అసలైన పరీక్ష!|EDITORIAL

ఎల్‌నినో బలహీనపడాలని, సమయానుకూలం గా వర్షాలు కురవాలని కోరుకోవడం సహజమే. కానీ వాతావరణాన్ని మార్చలేం. దాని ప్రభావాన్ని తగ్గించే వ్యవసాయ విధానాలను మాత్రం ముందుగానే రూపొందించవచ్చు. ఇదే ఇప్పుడు కేంద్రం, రాష్ట్రాలు, శాస్త్రవేత్తలు,...

సెప్టెంబర్ 30, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి చవితి సాయంత్రం 04.35 వరకు ఉపరి పంచమి నక్షత్రం భరణి ఉదయం 10.08 వరకు ఉపరి కృత్తిక యోగం హర్షణ ఉదయం 06.37 వరకు ఉపరి వజ్ర కరణం బాలవ సాయంత్రం 04.35 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News