ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను తీరొక్క తీరుగ శేత్తాండ్లు. మట్టి యినాయకులనే కొందరు శేత్తాంటే.. ఇంకొందరు గా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తోటి శేయబట్టిరి. గివీటికేవీ కాకుండ, యెరైటీగా గా యినాయకుడిని తయారు శేత్తాండ్రు మరికొందరు. గట్లనే గా గుంటూరు జిల్ల తెనాలిల శేసిండ్రు. సూసొత్తాం పదండ్రి.

తెనాలిల మిర్చీ స్నాక్స్ అని ఓ మిఠాయిల దుకుణం ఉంది. గీసారి యెరైటీగా మిఠాయితోటే యినాకుడి యిగ్రహాన్ని తయారు శేసిండ్రు. కోవాతోటి గా లంబోదరుని పతిమను తీర్చిదిద్దిండ్రు. ఇగ మండపాన్ని లడ్డూతోటి తయారు శేసిండ్రు. ఇగ రకరకాల ఆకారాలతోటి లడ్డూ ప్రసాదాలను కూడా తయారు శేత్తాండ్రట. మంచిగుంది కదా గీ ఐవుడియ. ఇంకెవలెవలు ఎన్ని రకాలుగ తయారు శేత్తాండ్రో ఏమో మరి!?

