Monday, August 3, 2026
29.5 C
Hyderabad

అత్యధిక బ్లడ్ డోనర్ మోటివేటర్ డా. రాజేశ్వర్ రావు|INTERNATIONAL|BLOOD|DONORS

రక్తదాన సేవలకు గుర్తింపుగా గవర్నర్ సత్కారం|BLOOD DONATION|GOVERNOR

హైదరాబాద్, జూన్ 14 (అడుగు న్యూస్): రక్తదానం పట్ల సమాజంలో విస్తృత ప్రచారం, చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్త దానాన్ని విశేషంగా ప్రోత్సహిస్తూ, విశిష్ట సేవలందిస్తున్న  మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రెడ్ క్రాస్ శాఖ చైర్మన్, సాంస్కృతిక, పర్యాటక, ప్రొహిబిష‌న్, ఎక్సైజ్ శాఖల మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఓఎస్డీ  డా. ఎస్.ఎం. రాజేశ్వర్ రావును తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా  సత్కరించి, పురస్కారం అందజేశారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా లోక్ భవన్‌లోని సంస్కృతి కమ్యూనిటీ హాల్‌లో భారత రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని గవర్నర్ ప్రారంభించారు. అనంత‌రం విశిష్ట సేవలందించిన వైద్యులు, అత్యధిక సార్లు రక్తదానం చేసిన దాతలు, రక్తదాన శిబిరాల నిర్వాహకులు, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద భారత రెడ్‌ క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖకు విశేష సహకారం అందించిన సంస్థల ప్రతినిధులను గవర్నర్ సత్కరించారు.

స్వచ్ఛంద రక్తదానోద్యమంలో ప్రజలను భాగస్వాములను చేయడంలో, అవగాహన కల్పించడంలో డా. రాజేశ్వర్ రావు చేస్తున్న కృషికి, ఆయనను “హయ్యెస్ట్ బ్లడ్ డోనర్ మోటివేటర్ అవార్డు–2026″కు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా ఆయన అవార్డును స్వీకరించారు.

డా. రాజేశ్వర్ రావు నాయకత్వంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రెడ్ క్రాస్ శాఖ చేపట్టిన సేవా కార్యక్రమాలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి. 2023 మార్చి నుంచి 2026 మే వరకు 113 రక్తదాన శిబిరాలను నిర్వహించి 8,279 యూనిట్ల రక్తాన్ని సేకరించగా, ఆ రక్తం తలసేమియా, క్యాన్సర్ రోగులకు ఎంతో ఉపయోగపడింది. అలాగే 467 ఉచిత వైద్య శిబిరాల ద్వారా 24,142 మందికి పైగా వృద్ధులు, దివ్యాంగులు, గిరిజన ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించారు. అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు 20 సీపీఆర్, ఫస్ట్ ఎయిడ్ శిక్షణ కార్యక్రమాల ద్వారా 1,865 మందికి శిక్షణ కల్పించారు. శామీర్‌పేటలో వృద్ధుల కోసం ‘ప్రణామ్’ డే కేర్ సెంటర్, బోయిన్‌పల్లిలో మిస్రీలాల్ మంగీలాల్ మాతా-శిశు వైద్యశాలని నిర్వహిస్తూ పేద కుటుంబాలకు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. వీటితో పాటు టీబీ ముక్త్ అభియాన్, ఆయుష్మాన్ భారత్ పథకం నమోదు, వరద బాధితులకు సహాయక చర్యలు, యువ రెడ్ క్రాస్ వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను ఆయన సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, శాంతి భద్రతల విభాగం డైరెక్టర్ జనరల్  మహేష్ భగవత్, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ ప్రధాన కార్యదర్శి, సీఈఓ ప్రొఫెసర్ శ్రీరాములు, ట్రెజరర్ శ్రీనివాస్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి శశికిరణాచారి, లార్వెన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ విహార్, సీఈఓ  రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

Latest News

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News