TELANGANA|తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా ముగ్గురు నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ADLURI LAXMAN KUMAR|అడ్లూరి లక్ష్మణ్ కుమార్, VAKITI SRIHARI|వాకిటి శ్రీహరి, GADDAM VIVEK VENKATSWAMY|గడ్డం వివేక్ వెంకటస్వామిలను రాష్ట్ర మంత్రులుగా STATE|రాష్ట్ర GOVERNOR|గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రమాణం స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హాజరై నూతన మంత్రులను అభినందించారు. అలాగే శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ జి ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క), కొండా సురేఖ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
ఇదిలా ఉండగా, మంత్రి పదవి ఆశించి, భంగపడ్డ వారికి బుజ్జగింపులు పర్వం మొదలైంది. అందులో భాగంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసానికి ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం. నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్ లు చేరుకొని పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ పటిష్టత కోసం శ్రమిస్తున్న నాయకత్వం ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు లను కూడా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. వారిని పార్టీకి కట్టుబడి ఉండేలా చేయాలనే బుజ్జగిస్తున్నారని సమాచారం.

