Wednesday, August 19, 2026
26.1 C
Hyderabad

భౌ భౌ…! భౌ భౌ…భౌ!!|DOGS|GOVERNMENT

కుక్క కాటుకు చెప్పు..! దెబ్బేనా?
‘కుక్కలకు ‘పిచ్చి’ నిజమేనా?
కుక్క కరిస్తే మనుషులకు పిచ్చేనా?
కుక్కలంటే ‘మనుషులకు పిచ్చి’ ఎందుకు?
రెచ్చిపోతున్న పిచ్చి కుక్కలు…
విచ్చలవిడిగా విస్తరిస్తోన్న వీధి కుక్కలు
కరిచి, రక్కి, కొరికి పారేస్తున్న శునకాలు
జీవ కారుణ్యమా? జీవ దారుణ్యమా?
కుక్కల నియంత్రణకు ‘సుప్రీం’ ఆదేశాలు
అత్యున్నత కోర్టు ఆదేశాలను సర్కార్ల బేఖాతర్
కుక్కలను సాదుకునే రోజుల నుంచి…
కుక్కలంటేనే ‘సావు’ రోజులొచ్చాయ్!

‘అడుగు’ ప్రత్యేకం
✍️-డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ

కుక్కకు కూడా ఓ రోజొస్తుందంటే ఏమో అనుకున్నాం! నిజంగానే కుక్కల రోజులు వస్తాయని ఎవరు అనుకున్నారు? ప్రస్తుతం కుక్కల రోజులే నడుస్తున్నాయి. లేకపోతే, ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం, సుప్రీం కోర్టు పదే పదే జోక్యం చేసుకుంటూ, కుక్కల నియంత్రణకు కఠినమైన ఆదేశాలివ్వడం ఎక్కడైనా చూశారా? ఎప్పుడైనా విన్నారా? కుక్కల అదుపునకు ‘సుప్రీం’ మార్గదర్శకాలను ఇవ్వడం మామూలుగా జరిగే పనేనా? అత్యంత నమ్మకమైన పెంపుడు జంతువుగా, కొలిచి మొక్కే కుక్కే, కాటేస్తే దిక్కు, మొక్కూ లేకుండా పోతుందని ఎవరనుకున్నారు? అంతా కాలం ‘మహి’మ. కాల భైరవుడి వాహనుడే కాల యముడై కాటేస్తున్న, కలికాలపు విపరీతపు వింత పోకడ కాకపోతే మరేంటి?

కాల భైరవుడి వాహనం. గ్రామ సింహం. శునకం. అత్యంత విశ్వాసమైన పెంపుడు జంతువు. పేరేదైనా అది కుక్క. కుక్క కుక్కే. అందుకే ‘కనకపు సింహాసనం మీద శునకమును కూర్చుండ బెట్టిన, వెనుకటి గుణమేల పోవు?’ అన్నది అందుకేనేమో! అది అనుభవసారం.
మనిషి మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు కుక్కే. కుక్కలు చాలా నమ్మకమైనవి. అందుకే మానవ స్నే‘హితులు’గా ప్రసిద్ధి చెందాయి. కుక్కలు క్షీరదాలు. అవి మనుషుల్లాగే తమ పిల్లలకు పాలు ఇచ్చి పెంచుతాయి. ఇవి ‘కానిడే’ కుటుంబానికి చెందిన మాంసాహారులు. కుక్కల సగటు జీవితకాలం 10 నుండి 13 ఏళ్ళు. 14వేల ఏళ్ళ కిందటే కుక్కలు మనుషులతో కలిసి జీవించడం ప్రారంభించాయని ఆధారాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 340 కి పైగా కుక్క జాతులు ఉన్నాయి. కుక్కల శరీరంలో తోక పొడవును బట్టి 320 ఎముకలు, 700 కండరాలు ఉంటాయి. కొన్ని సంస్కృతులలో కుక్కను దైవంగా భావిస్తారు. భారతదేశంలో కాలభైరవుని వాహనంగా కొలుస్తారు.

కుక్కల జనాభా 90 కోట్లు!
విశ్వ వ్యాప్తంగా 90 కోట్లకు పైగా కుక్కలు ఉన్నాయట! వీటిలో 47 కోట్లు పెంపుడు కుక్కలు కాగా, మిగిలినవి వీధి కుక్కలు. ప్రపంచంలోని మొత్తం కుక్కల్లో 75% వీధి కుక్కలేనట. అత్యధిక కుక్కలున్న దేశం అమెరికా. అమెరికాలో వాటి సంఖ్య 7.58 కోట్లుగా అంచనా. బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది.

దేశంలో ఐదున్నర కోట్లు.. !
భారతదేశంలో ఉన్న 5.25 కోట్ల కుక్కల్లో 1.53 కోట్ల వీధి కుక్కలు ఉన్నాయని అంచనా. దేశంలోని ఉత్తర ప్రదేశ్ లో అత్యధికంగా కుక్కలున్నాయట! అయితే కుక్కల మొత్తం జనాభాకు సంబంధించిన నిర్దిష్ట సంఖ్య అందుబాటులో లేదు.

తెలంగాణలో…
ఇక తెలంగాణ వ్యాప్తంగా కుక్కల ఖచ్చితమైన సంఖ్య తెలియదు. కానీ, అందుబాటులో ఉన్న అంచనాల ప్రకారం ఒక్క హైదరాబాద్‌లోనే 15 లక్షల కుక్కలు ఉన్నాయట! అందులో 3.8 లక్షలకు పైగా వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేయబడింది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఈ లెక్కకు మించే, పెద్ద సంఖ్యలో కుక్కలు ఉన్నాయి.

ఏపీలో 8.64 లక్షల కుక్కలు
2019 లైవ్‌స్టాక్ సెన్సెస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 8.64 లక్షల కుక్కలు ఉన్నాయి, అందులో 4.72 లక్షలు వీధి కుక్కలు. వీధి కుక్కల నియంత్రణ సమర్థవంతంగా లేని కారణంగా ఈ సంఖ్య పెరుగుతూనే ఉందనడానికి కుక్కకాటు సంఘటనలే తార్కాణం.

కుక్కలతోపాటు పెరుగుతున్న కుక్కకాట్లు
రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 300 కంటే ఎక్కువ కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి, హైదరాబాద్‌లో రోజుకు వందకు పైగా కేసులు ఉన్నాయి. 2022-24 మధ్య గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 35%, రాష్ట్రవ్యాప్తంగా 31% కుక్కకాటు కేసులు పెరిగాయి.

తాజా ఘటనలు:
తాజాగా మొన్న సోమవారం నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో ఓ పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. ఒక్కరోజే 50 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు, 20 మంది మహిళలు, 26 మంది పురుషులు గాయపడ్డారు. హయత్‌నగర్‌లోని శివగంగా కాలనీలో ఏడేళ్ల చిన్నారిపై 20 వీధి కుక్కలు దాడి చేసిన సంఘటన ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నది.

మానవహక్కుల కోర్టు విచారణ
నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో వీధి కుక్కలు 30 మందిని గాయపరిచిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది.

సుప్రీం కోర్టు విచారణ, ఆదేశాలు
వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రహదారులపైకి కుక్కలు, పశువులు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని పేర్కొంది. డ్రైవ్ అమలుపై 8 వారాల్లో స్టేటస్ రిపోర్టు అందజేయాలని ఆదేశించింది. స్కూల్స్‌, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, దవాఖానాల్లోకి.. కుక్కలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. వీధి కుక్కల నిర్వహణపై అమికస్ క్యూరీ నివేదికను అమలు చేయాలని ఉత్తర్వులిచ్చింది. నివేదిక అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ దాఖలు చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి.అంజారియా ధర్మాసనం ఈవిచారణ చేపట్టింది.
ఈ విచారణలో పశువుల సంక్షేమ బోర్డు(ఎడబ్ల్యుబీఐ)ను ఇంప్లీడ్ చేయడంతో పాటు, కుక్కల దాడులకు గురైన బాధితుల దరఖాస్తులకు అనుమతి ఇచ్చింది. రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు పునరుద్ఘాటించింది. ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే సంబంధిత అధికారులపై వ్యక్తిగత చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

జంతు ప్రేమికుల వాదనలేంటి?
‘కుక్కలు కూడా జీవులే, వాటికీ కూడా కరుణ, సంరక్షణ అవసరం. వాటిని వీధుల్లో వదిలివేయడం లేదా చంపడం వంటివి చేయకూడదు. జంతువులను చంపడం లేదా హింసించడం కాకుండా, స్టెరిలైజేషన్ వంటి శాశ్వత పరిష్కారాలతో జనాభాను అదుపులో ఉంచాలి. ఇది జంతువుల పునరుత్పత్తిని నిరోధిస్తుంది. వీధి కుక్కలకు సురక్షితమైన ఆశ్రయాలు నిర్మించి, వాటికి ఆహారం, వైద్య సంరక్షణ అందించాలి. కుక్కల ప్రవర్తనను, వాటి జనాభాను, ప్రజారోగ్య ప్రమాదాలను అంచనా వేయడానికి శాస్త్రీయ ఆధారాలు, డేటాను ఉపయోగించాలి. ప్రజారోగ్య సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు, స్థానిక అధికారులు చురుగ్గా వ్యవహరించాలి.’ అని జంతు ప్రేమికులు వాదిస్తున్నారు.

కుక్క కాటు మరణాల్లో 36% మన దేశంలోనే!
ప్రపంచవ్యాప్తంగా రేబిస్ మరణాలలో 36% భారతదేశంలోనే ఉన్నాయని ఒక అంచనా. ఇది వీధి కుక్కల విస్తరణ, విజృంభణ, విశృంఖలానికి నిదర్శనం. కాగా, వీధి కుక్కలు ప్రత్యేకించి పిల్లలే లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి.

అసలు… కుక్కలెందుకు అలా ప్రవర్తిస్తాయి?
కుక్కల ప్రవర్తనకు రేబిస్ వ్యాధితో సంబంధం లేదు. వ్యాధి సోకినప్పుడు దాని మానసిక స్థితి ఎలా ఉంటుందో, ఆకలి, దాహంగా ఉన్నప్పుడు కూడా అవి అలాగే ప్రవర్తిస్తాయి. కుక్కల్లో చెమట గ్రంథులు ఉండవు. నోటిద్వారానే ఒగరుస్తూ వాటి శరీర వేడిని బయటికి వదులుతుంటాయి. ఆ స్థితిలో కూడా అవి చాలా అసహనంగా ఉంటాయి. అయితే కుక్క పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయలేం.

పిల్లల మీద ఎందుకు విరుచుకుపడతాయి?
కుక్కలకు పిల్లలూ, పెద్దలు తేడా ఏమీ లేదు. రోజుల తరబడి ఆహారం తినకుండా ఉండడం వల్లే అవి ఎగబడతాయి. కొంతమంది పిల్లలు వాటి తోక తొక్కుతూ, రాళ్లు విసురుతూ చికాకు తెప్పిస్తుంటారు. అలాంటప్పుడు కూడా అవి విరుచుకుపడతాయి. కాబట్టి కుక్క జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది.

కుక్క కాటుకు చికిత్స విధానం
కుక్క కరిచిన ప్రదేశాన్ని 10-15 నిమిషాలు సబ్బు, నీటితో బాగా కడగాలి. ఆ తర్వాత 70% ఆల్కహాల్ లేదా అయోడిన్ వంటి క్రిమిసంహారక మందుతో శుభ్రం చేయాలి. వెంటనే సమీపంలోని హాస్పిటల్ కి వెళ్లి వైద్య సహాయం తీసుకోవాలి.

రేబిస్ వ్యాక్సిన్
రేబిస్ వ్యాక్సిన్ సాధారణంగా 14 రోజుల వ్యవధిలో 4 మోతాదులలో ఇస్తారు. వ్యాక్సిన్‌తో పాటు, రేబిస్ ఇమ్యునోగ్లోబులిన్ అనే ఇంజెక్షన్‌ను కూడా ఇవ్వవచ్చు, ఇది జంతువు కరిచిన ప్రాంతానికి సమీపంలో ఇవ్వబడుతుంది.

మరి కుక్కల నియంత్రణ ఎలా?
కుక్కలను పట్టుకుని, వాటికి స్టెరిలైజేషన్ ఆపరేషన్లు చేసి, రేబిస్ వ్యాధికి టీకాలు వేస్తారు. నులిపురుగుల నివారణ మందులు కూడా అందిస్తారు. ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత, కుక్కలను వాటి ప్రదేశంలోనే తిరిగి వదిలేస్తారు.

ప్రజల బాధ్యతలు, అవగాహన
కుక్కల ప్రవర్తన, వాటితో వ్యవహరించాల్సిన తీరుతెన్నులపై ప్రజలకు, కాలనీ సంఘాలకు అవగాహన కల్పిస్తారు. పెంపుడు కుక్కలను తప్పనిసరిగా నమోదు చేయించాలి, తద్వారా కుక్కకాటు ఘటనలు తగ్గించవచ్చు. కుక్కలకు ఆహారం, నీరు వంటివి ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఇవ్వడం, అలాగే ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడం కూడా ముఖ్యం.

కాపాడుకోవడం ఎలా?
ఒకవేళ దూకుడుగా ఉన్న కుక్క ఎదురైతే, దాని నుండి పరిగెత్తి పారిపోవద్దు. అలా చేస్తే అది మరింత వెంబడించవచ్చు. కుక్కకు వెన్ను చూపకుండా, నెమ్మదిగా, జాగ్రత్తగా దూరంగా నడవాలి. కుక్క దృష్టిని మళ్లించడానికి బిస్కెట్లు వంటి ఆహారం విసిరివేయవచ్చు. కుక్కలు ఆహారంపై దృష్టి పెట్టినప్పుడు, మీరు సురక్షితంగా వెళ్ళిపోవచ్చు. ముఖ్యంగా చేతిలో కర్ర ఉండటం బెటర్. ఎట్టి పరిస్థితుల్లోనూ కర్రను చేతి నుండి జారవిడవటం కానీ, విసరడం కానీ చేయొద్దు. చేతి కర్రతో కుక్కలను భయపెట్టాలి. చేతిలో కర్రలేకపోతే, నిల్చున్న చోటే చేతిలోకి రాయి తీసుకోవడం కానీ, తీసుకున్నట్లుగా నటించడం కానీ చేస్తే కుక్కలు పారిపోతాయి. కుక్కలకు భయపడితే అవి మనల్ని భయపెడతాయి. వాటిని మనం భయపెడితే, అవి భయపడతాయి.

సామాజిక సమస్య


– డాక్టర్ రాపోలు సత్యనారాయణ

కుక్కలు, కోతులు సామాజిక సమస్యగా పరిణమించాయి. ఇప్పటికీ సాదక సహజీవన చరులుగా ఉన్న కుక్కలు సాదుకున్న వారిని కూడా రక్కడం, గీరడం వంటివి చేస్తున్నాయి. ఇక వీధి కుక్కలు, పిచ్చికుక్కలు మనుషులపై దాడులు చేస్తున్నాయి. కుక్కలు గీరినా, రక్కినా, కాటేసినా, చికిత్స తప్పనిసరి. టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీధి కుక్కలను చంపడమే పరిష్కారం కాదు. శాస్త్రీయంగా అదుపు చేయవచ్చు. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

Latest News

వరుస ఆరోపణలు.. షోకాజ్ నోటీసులు!|CONGRESS|NOTICE

తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతుంది?|TELANGANA|CM|REVANTH REDDY|KONDA FAMILY తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కుటుంబం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం మధ్య...

సుస్మితకు ఎమ్మెల్యేల ఘాటు కౌంటర్|KONDA FAMILY|MLAS|COUNTER

క్రమశిక్షణ చర్యలపై కాంగ్రెస్‌ ఫోకస్|MALLU RAVI|CONGRESS|FOCUS తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...

సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా….|TELANGANA|CONGRESS|KONDA|REVANTH REDDY

సీఎం రేవంత్ వర్సెస్ కొండా కుటుంబం!|CM|KONDA SUSMITHA ఒకవైపు జెన్ జీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలి అంటావ్ మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇస్తా అంటావ్ - మంత్రి కొండా సురేఖ...

స్టార్ హోటల్ల దోశ గిట్లనే తినాల్నట!?|ADUGU TRENDS

శిన్నప్పుడు మనం ఎట్ల తినాల్నో? ఎట్ల తినకూడదో మన అవ్వయ్యలు నేర్పిత్తురు. అన్నలక్కలు కూడా శెప్తరు. గట్లనే మనం తినడం నేర్సుకుంటం. పెద్దగైనంక సుత.. గట్ల తినుడే అలవాటు శేసుకుంటం. కనీ, పెద్ద పెద్ద...

ఉగ్రవాదం : అనుమానమే ఆయుధం కాకూడదు!?|EDITORIAL

దేశ భద్రతకు ‘ప్రజలు కూడా బాధ్యతాయుతమైన సమాచార భాగస్వాములుగా ఉండాలి. నిఘా సంస్థలు ఆధారాలను విశ్లేషించి, చట్టబద్ధమైన దర్యాప్తు ద్వారా నిందితులను గుర్తించాలి. ఉగ్రవాదంపై కఠిన చర్య అవసరం. అదే సమయంలో నిరపరాధ...

ఆగస్టు19, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి శు.సప్తమి రాత్రి 08.09 వరకు ఉపరి అష్టమి నక్షత్రం స్వాతి ఉదయం 08.58 వరకు ఉపరి విశాఖ యోగం శుక్ల ఉదయం 06.37 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 07.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

హవ్వ…ఆవు పెండ మట్టితోటి శివలింగం!?|ADUGU TRENDS

సావును తప్పించుకోవడానికి భక్త మార్కండేయుడు శివలింగాన్ని బిర్రుగ కావలిచ్చుని తపస్సు శేసిండు. యముడి పాశం శివలింగానికి తాకడంతోటి శివుడికి కోపమొచ్చిందిట. యముడిని తరిమికొట్టి మార్కండేయునికి చిరంజీవిగా వరం ఇచ్చిండట. గట్లనే తిన్నడు గదేనుల్ల భక్త...

మరి, ‘సౌరశక్తి మంథన్’ మాటేమిటి!?|EDITORIAL

చమురు, గ్యాస్‌ అన్వేషణ దేశానికి తక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలను అందించవచ్చు. కానీ అవి పరిమిత వనరులు. సూర్యుడు మాత్రం నిరంతర ఇంధన వనరు. అందుకే ‘సముద్ర మంథన్‌’తో పాటు ‘సౌర శక్తి మంథన్‌’...

ఆగస్టు 18, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం మంగళగౌరి వ్రతం తిధి శు.షష్ఠి రాత్రి 07.11 వరకు ఉపరి సప్తమి నక్షత్రం చిత్త ఉదయం 07.34 వరకు ఉపరి స్వాతి యోగం శుభ ఉదయం 07.00 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 06.58 వరకు ఉపరి...

ఆగస్టు 17, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం నాగ పంచమి గరుడ పంచమి తిధి శు.పంచమి సాయంత్రం 06.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం హస్త ఉదయం 06.40 వరకు ఉపరి చిత్త యోగం సాధ్య ఉదయం 07.51 వరకు ఉపరి శుభ కరణం బవ ఉదయం...

గా ఊల్లె తాగొద్దు..!?|ADUGU TRENDS

ఎనకటికి 'మందు తాగనోడు దున్నపోతై పుట్టున్ ' అన్నరు. కానీ గా ఊరోల్లు మాత్రం మందు తాగితే జరిమానా ఏత్తం అంటున్నరు. పెండ్లి కానోళ్లు తాగొద్దట! పెండ్లి అయినోళ్ళు తాగొచ్చట? కానీ, కొట్లాడుకోవద్దట! తమిళనాడు...

రాహుల్ గాంధీ ముందున్న సవాల్ ఇదే!?|EDITORIAL

రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎదురున్న అసలు సవాల్ మోదీని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. తన రాజకీయ శైలిని పునర్నిర్మించుకోవడం. సభలో హుందాతనం, వాస్తవాలపై పట్టు, విదేశాంగంపై బాధ్యతాయుతమైన భాష, పార్టీ పునర్వ్యవస్థీకరణ, యువ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News