ఎంపీ ఈటల రాజేందర్ పై పోచారం పోలీసులు కేసు నమోదు చేశారు. గ్యార ఉపేందర్ ఇచ్చిన పిర్యాదు ఆధారంగా, 126(2), 115(2), 352, 351(2), r/w 189(2), r/w 191(2) BNS యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. పిర్యాదులో, ఏకశిలా నగర్లో సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా, ఈటల రాజేందర్ మరియు 30 మంది వ్యక్తులు కలిసి దాడి చేశారని ఫిర్యాదులో తెలిపారు. ఈ కేసు పై అధికారులు విచారణ చేపట్టారు.

