ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా నియమిస్తూ కూటమి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఆయనపై వైసీపీ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు మోపి రెండు సార్లు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంది. సస్పెన్షన్ ఎత్తివేయడమే కాకుండా, ఆ కాలాన్ని ఇన్ సర్వీస్‌గా పరిగణిస్తూ వేతనం, అలవెన్సులు కూడా చెల్లించనుందని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు, అధికారికంగా ఆయనకు పోస్టింగ్ ఇచ్చి, రెండు సంవత్సరాల పాటు చైర్మన్‌గా కొనసాగనున్నట్లు స్పష్టతనిచ్చింది.

