గత 2023 ఎన్నికల నుండి పూర్వ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కనబడుటలేదని సోషల్ మీడియాలో బిజెపి పోస్ట్ పెట్టింది. ఈ పోస్టులో పదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించి, ప్రజల ఆకాంక్షలను విస్మరించిన ఈయన, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా తన పాత్రను మరచినట్టు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలు ప్రజల తరఫున ప్రశ్నిస్తారని ప్రజలు ఆశించినప్పటికీ, ఆయన గల్లంతయ్యారని, అధికార భోగాలు మాత్రమే ఆయనకు ఆసక్తి, ప్రజల సమస్యలు, వారి నష్టాలపై కనీస శ్రద్ధలేదని, ప్రశ్నిస్తానన్న మాటలే తప్ప, కార్యాలయాలు ఖాళీగా ఉన్నాయి అంటూ తీవ్రంగా బీజేపీ విమర్శించింది.

