సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌ను అకస్మాత్తుగా ఆపడంతో వెనుక ఉన్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది పరిస్థితిని కంట్రోల్ చేశారు. మంత్రికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

