Wednesday, July 29, 2026
23.6 C
Hyderabad

ట్రంప్ మరో సంచలన నిర్ణయం..

41 దేశాలపై ట్రావెల్ బ్యాన్..

ఆమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 41 దేశాలపై కఠినమైన ప్రయాణ ఆంక్షలను విధించేందుకు ఆయన ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రతిపాదిత నిషేధంపై ఆయా వర్గాల సమాచారం ప్రకారం 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ నిషేధించనున్నట్లు తెలిసింది. వీటిని మూడు విభిన్న సమూహాలుగా విభజించి, ఆయా దేశాలపై ప్రయాణ పరిమితులను విధించేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

మొదటి సమూహం – పూర్తి వీసా నిషేధం

ఈ గ్రూపులోని దేశాల పౌరులకు అమెరికా వీసాలపై పూర్తిగా నిషేధం విధించే అవకాశం ఉంది. ఇందులో ఆఫ్ఘానిస్తాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తర కొరియా వంటి 10 దేశాలు ఉన్నాయి. ఈ దేశాల నుంచి ఎవరికీ వీసా ఇవ్వకుండా పూర్తిగా నిరాకరించే యోచనలో అమెరికా ఉన్నట్లు సమాచారం.

రెండో సమూహం – పాక్షిక నిషేధం

ఈ విభాగంలో ఎరిత్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్ వంటి 5 దేశాలు ఉన్నాయి. ఈ దేశ పౌరులు పర్యాటక, విద్యార్థి వీసాల కోసం అప్లై చేసుకుంటారు. కానీ ఇతర వీసాల పరంగా మాత్రం కఠిన ఆంక్షలు ఎదుర్కొవచ్చు.

మూడో గ్రూప్- 60 రోజుల గడువు

ఇందులో పాకిస్తాన్, భూటాన్, మయన్మార్ సహా మొత్తం 26 దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు తమ భద్రతా తనిఖీలను మెరుగుపరిచేందుకు 60 రోజుల గడువు పొందుతాయి. ఈ సమయంలో అవసరమైన మార్పులు చేయకపోతే, ఆ పౌరులకు వీసాల జారీని పాక్షికంగా నిలిపివేసే ఛాన్సుంది.

ఈ దేశాలపై ఎక్కువ ప్రభావం..

ఈ కొత్త నిషేధం వల్ల ఆయా దేశాల ప్రజలు అమెరికాకు ప్రయాణించడం మరింత కఠినతరం కానుంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపార వేత్తలు, కుటుంబ సభ్యులు ఈ ఆంక్షల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. అయితే ప్రధానంగా ముస్లిం మెజారిటీ ఉన్న కొన్ని దేశాలను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలోనూ ఇదే తరహా నిషేధాలు

2017లో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ట్రంప్ ఏడు ముస్లిం దేశాలపై ప్రయాణ నిషేధాన్ని విధించారు. అయితే, ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, 2018లో సుప్రీంకోర్టు దీనిని సమర్థించింది. ఇప్పుడు అదే దారిలో మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటూ మరోసారి ట్రంప్ తన వలస వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్నారు.

ఈ నిషేధం ఎందుకు..

అమెరికా జాతీయ భద్రతను కాపాడడమే లక్ష్యంగా ఆయా దేశాలపై ఈ నిషేధం విధించనున్నట్లు ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో గాజా, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్ వంటి ప్రాంతాల ప్రజలను యూఎస్ ప్రవేశించేలా చేయకూడదని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. 2023 అక్టోబర్‌లో జరిగిన ఓ ప్రసంగంలో ఆయన తాను రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే వలస నియంత్రణ మరింత కఠినతరం చేస్తానని చెప్పడం విశేషం.

Latest News

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

జూలై 27, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి త్రయోదశి మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం మూల ఉదయం 11.00 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం వైధృతి రాత్రి 12.18 వరకు ఉపరి విస్కమ్బ కరణం తైతుల మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి...

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News