వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబీకులు పేదల భూములు, ప్రభుత్వ భూములు కబ్జా చేశారనే ఆరోపణలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. ఇటీవల 52 ఎకరాల చుక్కల భూములు కబ్జా చేశారంటూ వచ్చిన వార్తలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. పేదల భూములకు, ప్రభుత్వ ఆస్తులకు ఎవరూ ఆక్రమించిన సహించబోమని హెచ్చరికలు జారీ చేశారు.
ఇందులో భాగంగా, అటవీ మరియు రెవెన్యూ శాఖ అధికారులకు భూకబ్జా ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ కబ్జాల విషయం డిప్యూటీ సీఎం దృష్టికి వెళ్లడంతో ఈ చర్యలు ప్రారంభమయ్యాయి. సంబంధిత అధికారులు ఇప్పుడు ఈ ఆరోపణలపై విచారణ ప్రారంభించి, నిజానిజాలు నిర్ధారించే పనిలో ఉన్నారు. అయితే, సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలను ఖండిస్తూ, తమపై వస్తున్న ఆరోపణలు అసత్యమని, తాము భూములను ఆక్రమించలేదని చెప్పుకొచ్చారు.

