Friday, August 28, 2026
25.6 C
Hyderabad

పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే అప్రతిష్ట!|EDITORIAL

వారం రోజులుగా పార్లమెంటులో అదే తంతు. చర్చ లేకుండానే రచ్చ రచ్చై ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. సమస్యలపై చర్చించాలన్న ఆసక్తి అటు అధికార పార్టీకి, ఇటు ప్రతిపక్ష పార్టీలకు లేకుండా పోయింది. సభ ప్రారంభం కాగానే చర్చకు పట్టుబట్టి గొడవ చేయడం విపక్షాల వంతైతే, చర్చకు అవకాశమే లేకుండా చేయడం అధికార పక్షానికి అలవాటుగా మారింది. వాయిదా వేయడం స్పీకర్‌ విధిగా మారింది. సోమవారం కూడా ఇదే తరహాలో మధ్యాహ్నానికి సభ వాయిదా పడింది. తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు జవాబుదారులమన్న సంగతిని మరిచిన సభ్యులు, పార్లమెంటును అధికార ప్రతిపక్షాల పట్టువిడుపులు లేని యుద్ధ వేదికగా చూస్తున్నట్లుగా ఉంది. పార్లమెంటులో అధికార, విపక్షాలు కాదు ప్రజలను గెలిపించాలి. ప్రజల మనసులు గెలిచే విధంగా ప్రవర్తించాలి. సమస్యలను చర్చించి పరిష్కరించాలి. ప్రజా సమస్యలను చర్చించి, పరిష్కరించే పవిత్ర వేదిక పార్లమెంటు. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ పార్లమెంటు. కానీ ప్రతిష్టంభనల వేదికగా మారుతోంది. ఈ వర్షాకాల సమావేశాల్లో ఇప్పటి వరకు కనీసం ఒక్కటంటే ఒక్క సమస్యపై కూడా చర్చ జరగని దుస్థితి నెలకొంది.

ఈ నెల 21న పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమ య్యాయి. ఎలాంటి అంశమైనా సరే, చర్చించడానికి సిద్దమని అధికార పక్షం చెబుతున్నా, విపక్షాలకు మాత్రం ఆ అవకాశమే ఇవ్వడం లేదు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పార్లమెంట్‌ సమావేశాలు అధికారంలో ఉన్న ఒకరిద్దరు నేతల కనుసన్నల్లో సాగుతున్నాయి. ఇదేదో అధికార, విపక్షాల సమస్యగా చూస్తున్నారు. 140 కోట్ల భారత ప్రజలంతా ఆందోళనలతో ఉన్నా పట్టించుకోవం లేదు. వరదలతో దేశం అతలాకుతలం అవుతోంది. దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మేడిపండు చందంగా మారింది. భారత ప్రజాస్వామిక రాజకీయాల్లో వ్యక్తి స్వామ్యం, నిరంకుశత్వం రోజురోజుకు ప్రబలిపోతోంది. పార్లమెంట్‌, అసెంబ్లీల్లో ప్రజల సమస్యల పై చర్చ జరగడం లేదు. అధికార విపక్షాలు ఇదేదో తమ సొంత జాగీరుగా భావించి.. సమావేశాలను నడుపుకుంటున్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఇదే తంతు సాగుతోంది. బీజేపీ అధికారం చేపట్టిన తరవాత ఈ వ్యవహారం బాగా ముదిరింది. సమస్య ఏదైనా పార్లమెంటులో చర్చకు రావడం లేదు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ ఇదే పద్ధతి సాగుతోంది.

అధికార, ప్రతిపక్షాలు తమ రాజకీయ ఎజెండాతో పనిచేయడం వల్లనే ఇలా జరుగుతోంది. పార్లమెంటు ప్రజలు ఎజెండాగా పని చేయాల్సిన వేదిక. అయితే అది రాజకీయ పార్టీల జెండాల ఎజెండాగా మారిపోతోంది. దేశంలో పెరుగుతున్న ధరలు, జీఎస్టీ పెంపు, వరదలు, నిరుద్యోగం లాంటి అంశాలపై చర్చించి జవాబివ్వాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షాలు ప్రవేశ పెడుతున్న వాయిదా తీర్మానాలను సభాపతులు బుట్టదాఖలు చేస్తున్నారు. కనీసం సభా వ్యవహారాల కమిటీ సమావేశాల్లో కూడా కీలక అంశాలపై చర్చకు సమయాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం మనస్ఫూర్తిగా ముందుకు రావడం లేదు. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైనప్పుడల్లా ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశంపై చర్చించడానికి తాము సిద్ధమని ప్రధాని మోడీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు ప్రకటించడం ఆనవాయితీగా మారింది. తొలి రోజు నుంచీ ప్రధాని మోడీ కూడా సభ సజావుగా సాగాలని, ఈ సమావేశాలకు ప్రాధాన్యం ఉందని అంటున్నారు. అయితే పార్లమెంట్‌ సమావేశమైన తర్వాత అలాంటి సుహృద్భావ వాతావరణం మాత్రం కనపడడం లేదు. పార్లమెంట్‌ సమావేశాలు జరిగినప్పుడల్లా అసలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎక్కడుందన్న అనుమానం కలుగుతుంది.

నిజానికి ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుందో చెప్పుకునే వీలున్న అద్భుతమైన ప్రచార, ప్రసార వేదిక పార్లమెంటు. అదే పార్లమెంటు వేదికగా ప్రజల సమస్యలను లేవనెత్తి, వాటికి సమాధానాలు రాబట్టి, పరిపాలనను సరైన గాడిలో పెట్టేందుకు ప్రతిపక్షాలకు అరుదైన వేదిక కూడా. ప్రజల తరపున ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపి, ప్రజాకోర్టులో నిలిపే వేదిక. కానీ భారత ప్రజాస్వామ్యంలో అధికారు ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటును తమ సొంత అభిప్రాయాలకు వేదికగా మలచుకుంటున్నారు. సభా నిబంధనలను తమకనుగుణంగా, అనుకూలంగా వాడుకుంటున్నారు. నిజానికి చట్టసభల్లో ప్రజా సమస్యలను చర్చించేందుకు విపక్షాలకు అవకాశం ఇవ్వాలి. వారు సమస్యలను ప్రస్తావిస్తే చర్చించాలి. చర్చల ద్వారా ప్రజల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే చట్టసభలకు విలువ ఉంటుంది. గతంలో ఎప్పుడూ చర్చలకు ప్రాధాన్యం ఉండేది. సమస్యలపై తక్షణ చర్చలు చేపట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. చట్టసభల గౌరవం ఇనుమడించేలా అధికార విపక్షాలు పని చేయాలి. చట్టసభలను పాలకులే ఎక్కువగా గౌరవించాలి. ప్రజల సమస్యలపై చర్చించడం అలవాటు చేసుకోవాలి. పార్లమెంట్‌ను నడిపించేందుకు రాజనీతిజ్ఞత అవసరం. మనం ఉన్నదే ప్రజల కోసం అన్న కోణంలో అధికార పక్షం ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలి. ఇలా నిరంకుశంగా వెళితే ఎంతటి వారికైనా ప్రజలు శిక్ష వేయక మానరు. మళ్లీ మాదే అధికారం అన్న అహంకార ధోరణి పనికిరాదు. పదేళ్లపాటు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్‌ అదే రీతిలో ప్రవర్తించి ఇప్పుడు అడ్రస్‌ లేకుండా పోయింది. బీజేపీ కూడా ఇదే ధోరణితో సాగితే ప్రజలు కాంగ్రెస్ కు పట్టిన గతినే పట్టిస్తారని గుర్తించాలి. అధికార ప్రతిపక్షాలు బాధ్యతతో వ్యవహరించాలి.

Latest News

‘రాఖీ’తో ‘రాజీ’…!?|RAKSHA BANDHAN|KONDA SUREKHA|CM|REVANTH REDDY

మంత్రి పదవికి ‘రక్షా’ బంధన్! కొండా సురేఖ వ్యూహం ఫలించేనా? ‘రక్షాబంధనం’ సురేఖక్క మంత్రి పదవిని రక్షిస్తుందా? ‘రాఖీ’తో ‘రాజీ’ కుదురుతుందా? మంత్రి కొండా సురేఖ వ్యూహం ఫలిస్తుందా? ఏం కానుంది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్...

తమ్ముడికి జీవితాన్నే బహమతిగా ఇచ్చిన అక్క!?|ADUGU TRENDS

రాఖీల పున్నం పండగను అన్నా శెల్లెల్లు, అక్కాతమ్ముళ్ల మద్దెల పేమానురాగాలకు, రచ్చణకు పతీకగా జరుపుకుంటరు. రాఖీ అంటే రచ్చణ కవచం. రచ్చా సూత్రం. గా అన్నాతమ్ముల్లకు ఆపదలు రాకుండా, గవాల్లు ఆయురారోగ్యాలతో కలకాలం...

హిమాలయాల్లో మహా విలయం!?|EDITORIAL

ఇంతటి విపత్తు నుంచి భారత్‌ పాఠాలు నేర్చుకోవాలి. హిమాలయాల్లో విచ్చలవిడిగా రహదారులు, హైడ్రోపవర్‌ ప్రాజెక్టులు, పర్యాటక నిర్మాణాలు చేపడుతూ పర్వతాల సహజ సమతౌల్యాన్ని దెబ్బతీస్తే ప్రమాదాల సంఖ్యేకాదు, వాటి తీవ్రతా పెరుగుతుంది. వాతావరణ...

ఆగస్టు 28, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం రాఖీ పూర్ణిమ జంధ్యాల పూర్ణిమ తిధి పౌర్ణమి ఉదయం 08.57 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం శతభిషం రాత్రి తెల్ల 03.43 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం అతిగండ ఉదయం 08.57 వరకు ఉపరి సుకర్మ కరణం బవ...

హద్దుల్లేని ముద్దురణం!?|ADUGU TRENDS

ము ముద్దంటే శేదా? అంటే ఎవరికి శేదు చెప్పండి? గందుకే కాకిపిల్ల కాకికి ముద్దన్నరు. తల్లికి పిల్లంటే ముద్దు. పేమికులకు ఒకలంటే ఇంకొకలికి ముద్దు. గా ముద్దు ముచ్చట ఒకామె గీ ఇధంగా...

ఆర్థిక పతనం దిశగా అమెరికా ఫస్ట్ నినాదం!?|EDITORIAL

‘అమెరికా ఫస్ట్’ అంటే ప్రపంచం నుంచి అమెరికా దూరం కావడం కాదు. అమెరికా ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతూనే ప్రపంచ వాణిజ్యం, శాంతి, స్థిరత్వంతో సమన్వయం సాధించాలి. లేకపోతే గొప్ప దేశాన్ని నిర్మించాలన్న నినాదమే...

ఆగస్టు 27, గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి చతుర్దశి ఉదయం 08.05 వరకు ఉపరి పొర్ణమి నక్షత్రం ధనిష్ఠ రాత్రి 02.38 వరకు ఉపరి శతభిషం యోగం శోభ ఉదయం 09.20 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 08.05 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

పనికి ఫార్చునర్ కారులో సఫాయి!?|ADUGU TRENDS

రోజులు మస్తుగ మారిపోతున్నయి. పేదా బక్క, బిక్కిబీదా తేడా లేకుండా పోతాంది. ఎవ్వలైనా హమ్ కిసీ సే కం నహీ అంటాండ్రు. గట్లనే గా సఫాయి కూడా అంటా0డు. గా సఫాయి రోజూ...

ఆర్థిక యుద్ధం అణుబాంబు కన్నా డేంజర్!?|EDITORIAL

యుద్ధానికి ఆయుధాలు అవసరం. ఆర్థిక యుద్ధానికి ప్రపంచ సహకారం అవసరం. అమెరికా ఆ సహకారాన్ని ఎంతవరకు సాధించగలదన్నదే అసలు పరీక్ష. ఇరాన్‌ను బలహీనపరచాలన్న అమెరికా ప్రయత్నం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచకుండా జాగ్రత్తపడాల్సిన...

ఆగస్టు 26, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి త్రయోదశి ఉదయం 06.53 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం శ్రవణ రాత్రి 01.03 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సౌభాగ్య ఉదయం 09.20 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 06.53 వరకు ఉపరి గరజి రాహుకాలం...

పార్టీ పెడితే పోలా!|ADUGU EXCLUSIVE|KONDA FAMILY|NEW PARTY

అడుగు ఎక్స్ క్లూజివ్ కొండా దంపతుల కొత్త పార్టీ? పాత పార్టీల్లో పొసగడం కష్టమే! కొత్త పార్టీతో ప్రయాణం స్పష్టమే! లక్ష్యం బీసీ సామాజిక న్యాయమే! ఇప్పటికే ప్రధాన పార్టీల్లో0చి బయటకు  కాంగ్రెస్ కాదంటే బీజేపీ ఛాన్స్? సిద్ధాంత రీత్యా కమలంలోనూ కష్టమే ఇప్పటికే...

పూర్వ ప్రేమికులకు.. అపూర్వ ప్రేమ రోజు!?|ADUGU TRENDS

యినడానికి గిది ఇబ్బందిగనే ఉన్నా, ఇది నిజమే మరి! కాకపోతే గిది మన దేసంల కాదు. పరాయి దేశంల. ఎవలైనా వయసొచ్చినంక పేమల పడ్తరు. అందరూ గా పేమల్ని గెలపించుకోలేరు. ఐటెంక వేరెవ్వల్నో...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News