తిరుపతి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కౌంటర్ ఇచ్చారు. బాధితులకు క్షమాపణలు చెప్పాలని పవన్ సూచించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన బీఆర్ నాయుడు, “ఎవరో ఏదో మాట్లాడితే ప్రతి విషయంపై స్పందించాల్సిన అవసరం లేదు. క్షమాపణలు చెప్పడంలో తప్పులేదు, కానీ చెప్పినంత మాత్రన పోయిన ప్రాణాలు తిరిగిరావు కదా” అని పేర్కొన్నారు.

