Thursday, July 30, 2026
23.7 C
Hyderabad

బహుజన ప్రభంజన్!|PRABHANJAN YADAV

బహుజన మేధావి, సీనియర్ జర్నలిస్ట్, ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ గారి సంస్మరణ సభ రేపు(26-07-2025, శనివారం) నిర్వహిస్తున్నాం. వారి మిత్రులు, శ్రేయోభిలాషులు, శిష్యులు, అభిమానులు హాజరై వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి.

-కుటుంబసభ్యులు, బంధుమిత్రులు.

……

బీసీపథమే
కార్యాచరణమని
బీసీ జోతిని వెలిగించి శపథం చేసావు
గొర్రెపిల్లలు పార్లమెంట్ మెట్లెక్కకముందే
బీరప్ప గొంగడి జెండా ఎగరకముందే
కాటమయ్య కొమురయ్యల కత్తి రాజముద్రిక కాకముందే
ఉద్యమ బండిగిల్ల పట్టూడిపోయే !
బీసీ కన్ను అదిరిపోయే!!

◆ బహుజన మేధావి
ప్రభంజన్ గారికి విప్లవ జోహార్లు!
అంటూ దివంగత ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పై ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్య రాసిన కవిత

బహుజన ప్రభంజన్!

కోడికూతలా
ఉదయమే నీ పాట
మేల్కొల్పే బీసీ పాట
సంధ్యపొద్దులా
జీవితాంతం బీసీ సూర్యోదయమే !

బీసీ బడులు
బీసీ క్లాసులు
బీసీ తాత్వికతలు
బీసీ మహాసభలు
బీసీ రాజ్యాధికారాలు
బీసీ మహాసంగ్రామానికి పగిడి

స్వాతంత్ర్యంలో
స్వాతంత్ర్యానికై
ఉక్కుపిడికిలెత్తిండు
బడుగులే జనమని
రచనలతో రాజీలేని కలం

వేదికలన్నైనా
బహుజనమే వాయిస్
బడుగుల హితమే
ప్రభంజన్ మతమని
బహుజనమే
భారతదేశమని వెలుగెత్తి చాటాడు

అమాయక బీసీలం కాము
పనికిరాని పుల్లలం కాము
అగ్గిపుల్లని తయారు చేసినాము
అగ్గిపెట్టెలో ఆరుగజాల నేతను నేసినాము
గొర్లను మేపే గొల్లలమే కాదు
దేశ ఆరోగ్యానికి మాంసం అందించాం
సహస్రవృత్తులు మా చేతికళలని
చైతన్యపు బోధనలతో
మాకు సోయి నేర్పావు
బీసీ రక్తం ఎక్కించావు

ఎర్రకోటపై
బీసీల జెండా ఎగరాలని కలగన్నావు
అంతిమ సమరంపై
పనిముట్లకు పదునెక్కించమన్నావు
బహుజన జయకేతనం ఎగిరే దాకా
మహత్మా పూలే అంబెద్కర్ రథాన్ని దిగనన్నావు

అన్యాయ భారతంలో
విముక్తిదారిని ఎత్తి చూపావు
ప్రతి బీసీ
బహుజన జండా కావాలని శపథం పట్టావు
ఆధిపత్యాలు
ముక్కలు కాకుంటే
అట్టడుగు కులాలకు న్యాయం దక్కదన్నావు
సామాజిక న్యాయాల రణభేరికి
ఉరిమావు డోలు డప్పై

బీసీపథమే
కార్యాచరణమని
బీసీ జోతిని వెలిగించి శపథం చేసావు
గొర్రెపిల్లలు పార్లమెంట్ మెట్లెక్కకముందే
బీరప్ప గొంగడి జెండా ఎగరకముందే
కాటమయ్య కొమురయ్యల కత్తి రాజముద్రిక కాకముందే
ఉద్యమ బండిగిల్ల పట్టూడిపోయే !
బీసీ కన్ను అదిరిపోయే!!

◆ బహుజన మేధావి
ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారికి విప్లవ జోహార్లు!

వనపట్ల సుబ్బయ్య
16.07.2025
9492765358

 

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News