Tuesday, September 8, 2026
32.2 C
Hyderabad

జనవరి 03 – 2025 శుక్రవారం

శ్రీ క్రోధినామ సంవత్సరం–దక్షిణాయనం
హేమంతఋతువు- పుష్యమాసం-శుక్లపక్షం
తిధి శు.చవితి రాత్రి 12.09 వరకు ఉపరి
పంచమి
నక్షత్రం ధనిష్ఠ రాత్రి 10.21 వరకు ఉపరి
శతభిషం
యోగం వజ్ర పగలు 02.43 వరకు ఉపరి
సిద్ది
కరణం వణజి పగలు 01.40 వరకు ఉపరి
బవ
వర్జ్యం రాత్రి తెల్ల 04.55 నుండి 06.23
వరకు
దుర్ముహూర్తం ఉదయం 08.24 నుండి
09.12 వరకు తిరిగి పగలు 12.24 నుండి
01.12 వరకు
రాహుకాలం పగలు 10.30 నుండి
12.00 వరకు
సూర్యోదయం ఉదయం 06.46
సూర్యాస్తమయం సాయంత్రం 05.53

జనవరి 03–2025 శుక్రవారం
రాశి ఫలితాలు

మేషం
నూతన విద్యవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. గృహ నిర్మాణ ఆటంకాలు తొలగుతాయి. ఆర్ధికంగా అభివృద్ధి కలుగుతుంది. ప్రయాణాలు కలసివస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.

వృషభం
చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆప్తులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగమున కొంత నిరుత్సాహం తప్పదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

మిధునం
దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలరు. ఆరోగ్య పరమైన సమస్యలు చికాకు కలిగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు శ్రమాధిక్యతతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. ఉద్యోగపరంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. స్వల్ప ధన ప్రాప్తి కలుగుతుంది.

కర్కాటకం
ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన ఉద్యోగ లబ్ది పొందుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

సింహం
ఉద్యోగ వ్యవహారాలలో తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి పై వారి నుండి ప్రశంసలు పొందుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూరప్రాంతాల వారి నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు.

కన్య
సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు వలన లాభం పొందుతారు. ధనదాయం బాగుంటుంది. అనారోగ్య సూచనలున్నవి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

తుల
వృత్తి ఉద్యోగ విషయమై కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలు పరంగా నష్టాల ఊబి నుండి బయటపడతారు. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

వృశ్చికం
అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.

ధనస్సు
వ్యాపార పరంగా ఇబ్బందులు తొలగుతాయి. ధన విషయాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు.

మకరం
ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించడం మంచిది. రుణ బాధలు తొలగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి బయట పడగలుగుతారు.

కుంభం
సంతానమునకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సోదరుల సహాయ సహకారాలు పొందుతారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది.

మీనం
ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నేత్ర సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగ విషయమై అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బంధువుల నుండి విమర్శలు ఎదురవుతాయి.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

రూపాయెకే వైద్గ సేవలు!?|ADUGU TRENDS

సంకల్పం ఉండాలె గనీ, యేదైనా సాధించొచ్చు. గట్లనే కొందరు ఉచిత సేవలందిత్తరు. గదానికి సరైన యిలువ ఉండదనుకున్నడో ఏమో గనీ, గీ డాస్కర్ శంకర్ దాస్ రాంచందానీ, ఒక్క రూపాయెకే వైద్గం అందిత్తాండు. గీ...

కొండా కుటుంబానికి కొత్త పరీక్ష!?|EDITORIAL

ఇప్పుడు కొండా కుటుంబం ముందున్న అసలు ప్రశ్న ‘ఎవరి మీద పోరాడాలి?’ అన్నది కాదు.. ‘ఎలా తిరిగి రాజకీయంగా బలపడాలి?’ అనేదే. మౌనం, సమన్వయం, సంస్థాగత పునర్నిర్మాణం ఈ మూడు మార్గాల్లో దేన్ని...

సెప్టెంబర్ 08, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి ద్వాదశి పగలు 01.49 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.55 వరకు ఉపరి ఆశ్లేష యోగం పరిఘ రాత్రి 01.59 వరకు ఉపరి శివ కరణం తైతుల పగలు 01.49 వరకు ఉపరి గరజి రాహుకాలం...

సెప్టెంబర్ 07, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి సాయంత్రం 04.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం పునర్వసు సాయంత్రం 06.23 వరకు ఉపరి పుష్యమి యోగం వ్యతీపాత ఉదయం 07.46 వరకు ఉపరి వరీయాన్ కరణం బాలవ సాయంత్రం 04.03 వరకు ఉపరి కౌలవ రాహుకాలం...

బర్త్ డే టు బర్తరఫ్!|KONDA FAMILY|CONGRESS|

తారుమారైన కొండా సు‘రేఖ’! 17 రోజుల్లోనే తలకిందులు? ‘చే’జేతులా...చెడిన రాజకీయం ఆగస్టు 19 నుంచి సెప్టెంబరం 3 వరకు మరి తర్వాత వారి దారెటు? కోరి కోరి పదవికి ఎసరు తెచ్చుకోవడమంటే ఇదే! అదీ లండన్ లో ఉన్న...

గుప్త సామ్రాజ్యం – ప్రారంభం మరియు అభివృద్ధి (క్రీ.శ.275-550)|ADUGU DIGITAL MEDIA|HISTORY|COMPITITIVE EXAMS|SPECIAL

గుప్తుల చరిత్రకు సంబంధించిన ఆధారాలు తెలుసుకోవడానికి సాహిత్యం, శాసనాలు మరియు నాణాలు ఉపయోగపడుతున్నాయి. గుప్త సామ్రాజ్యంలోని తొలి రాజులు *మహారాజ* అనే బిరుదును తీసుకోవడం వల్ల వీరు సామంతులుగా పాలించారని తెలుస్తుంది. కొంతమంది...

డాక్టర్ నెట్ ఇండియా-వైద్గం ఫ్రీ!?|ADUGU TRENDS

ఏదన్నా రోగమొత్తే అయిపాయె, ఆగమాగమైతం. యాడికిపోవాల్నో తెల్వదు. ఎంత కర్సైతదో తెల్వదు. ఇగ గిదే సందని, పైసలు గుంజుడు, పానం తీసుడు గా ప్రైవేట్ దవాఖాన్లల్ల పనైపాయె. పానం పోతదో, నిలుత్తదో కనీ,...

అధ్యాపకా! అభివందనం!!|EDITORIAL

నాణ్యమైన విద్య, సమర్థవంతమైన ఉపాధ్యాయ శిక్షణ, పరిశోధనకు ప్రోత్సాహం, పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించడమే రాధాకృష్ణన్‌కు నిజమైన నివాళి. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 06 నుండి సెప్టెంబర్ 12 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త ఆలోచనలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. ప్రారంభించిన పనులను మధ్యలో వదిలిపెట్టకుండా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగంలో మీ...

అమ్మంటే గామే!?|ADUGU TRENDS

మహారాష్ట్రల బీడ్ అంబాజోగాయిల అమ్రుత్ మహోత్సవ్ వేడుకలు జర్గుతానయి. అమ్రుత్ దౌడ్ మొదలైతాంది. గండ్లకు హఠాత్తుగా ఓ 47 ఏండ్ల రమాబాయి రణవీర్ దూసుకొచ్చింది. గా మారథాన్ పరుగు పందెంల ఉరుకుడు మొదలు...

ఏఐ యుగంలో గెలిచేది మానవ నైపుణ్యమే!?|EDITORIAL

ఉద్యోగార్థులకు ఏఐ గణాంకాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. డిగ్రీ లేదా అనుభవం ఒక్కటే భవిష్యత్తుకు భద్రత ఇవ్వవు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, ఉన్న నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం...

సెప్టెంబర్ 05, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి నవమి రాత్రి 08.54 వరకు ఉపరి దశమి నక్షత్రం మృగశిర రాత్రి 09.39 వరకు ఉపరి ఆరుద్ర యోగం వజ్ర పగలు 01.57 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 10.08 వరకు ఉపరి గరజి రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News