తలలు బోడులైనా తలపులు బోడులవునా? అన్నరు. గిది మనసుకు సంబంధించిన మాటే కావచ్చు. కనీ, మరి గిది శరీర ఫిట్ నెస్, మానసిక గట్టిదనానికి సంబంధించింది. గీయినె వయసు పెరిగినా, గా సాహసాలు శేసే బుద్ధి తగ్గలేదు. 18వేల అడుగుల ఎత్తు నుండి స్కై డైవింగ్ శేసి, ఔరా? అనిపించిండు.

గీ ముసలాయనది మన దేశమే. ఆస్ట్రేలియల ఉంటడు. గాడ గప్పుడప్పుడు స్కై డైవింగ్ చేసుడలవాటు. వయసు పెద్దదైంది. గనీ, గాయినె మనసు గటే గుంజింది. ఇగ గిదంత పని కాదని, ఇంకో మనిషి తోడుతోటి సిద్ద పడ్డడు. 18వేల అడుగుల ఎత్తు నుండి స్కై డై శేసిండు. జై ఇండియా అనుకుంట నేల మీద దిగిండు. గీ వయసుల గిదంతా ఎందుకంటే శేత్త అన్నడు. గట్టిగ పాలు తాగి వచ్చిన, కనీ పాలుతాగే పిల్లగాడినేం కాదన్నడు. అన్నట్లే స్కై డైవ్ శేసి సూపిండు. నిజమే కదా? ధైర్ణం, సాహసం ఉండాలె గనీ, వయసుతో పనేంది?

