Saturday, September 19, 2026
27.3 C
Hyderabad

పురాణాలలో వెలుగొందిన సరస్వతీ నది చరిత్ర

పుష్కరాలకు సిద్ధమవుతున్న భక్తులు

భారతదేశ చరిత్రలోనే కాక, పురాణాలలోను సరస్వతీ నది అపారమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. త్రివేణి సంగమంలో గంగ, యమునాలతో పాటు సరస్వతీ కూడా భాగమైనట్లు పురాణాలు తెలుపుతున్నాయి. అయితే ఈ నది ప్రస్తుతం ప్రత్యక్షంగా కనిపించకపోయినా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం భూగర్భ స్థాయిలో కనిపిస్తుందని నమ్మకం. త్వరలో జరగనున్న సరస్వతీ నది పుష్కరాల నేపథ్యంలో, ఈ పవిత్ర నది చరిత్ర, ప్రాధాన్యత, ప్రస్తుత పరిస్థితులు తెలుసుకోవడం ఆసక్తికరమైనది. నీటిని పంచభూతాలలో ఒకటిగా భావించే భారతీయ సంస్కృతిలో, నదులకు అత్యంత పవిత్ర స్థానం కలదు. వాటిలో సరస్వతీ నది విశిష్టమైనది. రుగ్వేదంలో ఈ నదిని “అంబితమే, నదీతమే, దేవీతమే” అని మహత్త్వంగా పేర్కొన్నారు. శాస్త్రవేత్తల అభిప్రాయాల ప్రకారం, సరస్వతీ నది ఒకప్పుడు హిమాలయాల శివాలిక్ కొండల్లోని హర్కీదూన్ హిమానీనదం నుంచి ప్రవహించి పంజాబ్, హర్యానా, రాజస్తాన్, గుజరాత్ రాష్ట్రాల గుండా వెళ్లి అరేబియా సముద్రంలో కలిసేదని భావిస్తున్నారు. ఇవే ఆధారంగా సరస్వతీ నది ఆధునిక కాలంలో గగ్గర్-హక్రా నదిగా గుర్తించబడింది. ఈ నది సుమారు 4000–5000 ఏళ్ల క్రితం భూగర్భ మార్పులు, వాతావరణ ప్రభావాల వల్ల ఎడారుల్లో దాగిపోయిందని, కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉత్తరాఖండ్‌లోని మానా గ్రామం వద్ద అలకనంద నదిలో కలిసే సరస్వతీ నది, భూమిపై కనిపించే కొన్ని అరుదైన ప్రాంతాల్లో ఒకటి. పురాణాల ప్రకారం సరస్వతీ నది బ్రహ్మదేవుని కమండలం నుంచి ప్రవహించిందని చెబుతారు. శాస్త్రీయంగా చూస్తే ఈ నది హిమాచల్ ప్రదేశ్ లేదా ఉత్తరాఖండ్‌లోని బందర్‌పూంచ్ మాసిఫ్ ప్రాంతం నుంచి ఉద్భవించి ఉండొచ్చని చెబుతారు. హరప్పా నాగరికతకు సరస్వతీ నది జీవనాధారంగా ఉండేదని, అక్కడి ప్రజలు ఈ నదిని జ్ఞానదాయక దేవతగా పూజించారన్న ఆధారాలు ఉన్నాయి. ఈ నది పుష్కరాలకు కూడా ఆధ్యాత్మిక ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. మిగతా నదుల మాదిరిగా 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే సరస్వతీ నది పుష్కరాలు ఈసారి 2025 మే 15 నుంచి మే 26 వరకు జరగనున్నాయి. గురు గ్రహం మిథునరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ పుష్కరాలు జరగడం ఆనవాయితీగా ఉంది. లక్షలాది మంది భక్తులు ఈ కాలంలో పుణ్యస్నానాలు చేయడానికి తరలివస్తారు. ఈ సందర్భంగా భక్తులు ఆధ్యాత్మిక శుద్ధిని పొందుతారని, మోక్షం దక్కుతుందని నమ్మకం. చారిత్రక, భౌగోళిక విశేషాలతో పాటు ధార్మికంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన సరస్వతీ నది, భారత సాంస్కృతిక వారసత్వానికి అద్దంపట్టే నది అని చెప్పవచ్చు.

Latest News

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News