Sunday, November 29, 2026
23.2 C
Hyderabad

ఢీలిమిటేషన్ తో రాజకీయాల్లో పెను మార్పులు!?|EDITORIAL

పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు దేశ రాజకీయ సమీకరణాలను, రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని, మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని మార్చగల ప్రక్రియ. తెలంగాణ, ఏపీల్లోనూ వచ్చే ఎన్నికల రాజకీయానికి కొత్త దిశానిర్దేశం చేయగలదు. అయితే, బిల్లుల ఆమోదం, రాజ్యాంగపరమైన ప్రక్రియలు, డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయాల తర్వాతే అసలు చిత్రం స్పష్టమవుతుంది?

మార్గం – అడుగు, ఎడిటోరియల్ 

దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన లక్ష్యంగా కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. గత ఏప్రిల్‌లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ సాధించలేక వీగిపోవడంతో, ఈసారి సవరించిన ప్రతిపాదనలతో కేంద్రం ముందుకొస్తోంది.

132వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచడం, రాష్ట్రాల మధ్య ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తిని 2051 వరకు కొనసాగించడం ప్రతిపాదనల్లో కీలకమైనవి. ప్రస్తుతం లోక్‌సభలో 543 స్థానాలుండగా, కొత్త ప్రతిపాదన ప్రకారం గరిష్ఠ సభ్యుల సంఖ్య 850కి చేరనుంది. రాష్ట్రాలకు 815, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. నియోజకవర్గాల అంతర్గత సరిహద్దుల పునర్విభజనకు అందుబాటులో ఉన్న తాజా జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోనున్నారు. ప్రస్తుతం 2011 జనాభా లెక్కలే అందుబాటులో ఉండటంతో అవే ప్రాతిపదిక కావచ్చని అంచనా.

ఈ మార్పులు తెలంగాణ రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రతిపాదిత 50 శాతం పెంపు అమలైతే లోక్‌సభ స్థానాలు 26కు, అసెంబ్లీ స్థానాలు సుమారు 179కు చేరవచ్చు. అంటే కొత్తగా 9 పార్లమెంటు, దాదాపు 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశముంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో జనాభా పెరుగుదల దృష్ట్యా నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఏ ప్రాంతంలో ఎన్ని స్థానాలు ఏర్పడతాయనేది డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయించిన తర్వాతే స్పష్టమవుతుంది.

మరోవైపు మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం ఈ ప్రతిపాదనల్లో అత్యంత ప్రాధాన్యమైన అంశం. తొలి డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చేలా మార్పులు ప్రతిపాదించారు. ఈ రిజర్వేషన్లు 15 సంవత్సరాలపాటు కొనసాగి, ప్రతి మూడు ఎన్నికల కాలాల తర్వాత రొటేషన్ పద్ధతిలో మారనున్నాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లను కూడా కొత్త నియోజకవర్గాల ప్రాతిపదికన ఖరారు చేయాల్సి ఉంటుంది. మహిళలకు రాజకీయ నిర్ణయాధికారంలో భాగస్వామ్యం పెంచడం ప్రజాస్వామ్యానికి సానుకూల పరిణామమే.

అయితే, డీలిమిటేషన్ వెనుక రాజకీయ ప్రయోజనాలే కాకుండా సమాఖ్య వ్యవస్థ సమతతౌల్యం కూడా కీలకం. జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా వాటి ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తిని కాపాడాలన్న డిమాండ్ నేపథ్యంలో కేంద్రం 50 శాతం పెంపు ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలగకుండా బిల్లుకు మద్దతు తెలిపే వైఖరి ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌లకు పెరిగే నియోజకవర్గాలు కొత్త రాజకీయ అవకాశాలను కల్పించనున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పట్టణీకరణ, యువ ఓటర్లు, వలస జనాభా, స్థానిక సమస్యలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయవచ్చు. కొత్త నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వాన్ని నిర్మించుకున్న పార్టీలకే ఆధిక్యం దక్కే అవకాశం ఉంటుంది.

డీలిమిటేషన్ కారణంగా 2028 డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు తప్పనిసరిగా వాయిదా పడతాయని, ఆరు నెలల రాష్ట్రపతి పాలన విధిస్తారని ఇప్పుడే నిర్ధారించడం రాజ్యాంగపరంగా సరైందేనా? ఆలోచించాలి. ఎన్నికల నిర్వహణ, అసెంబ్లీ పదవీకాలం, రాజ్యాంగ నిబంధనల ఆధారంగానే తుది నిర్ణయాలు ఉంటాయి.

అంతిమంగా డీలిమిటేషన్ అనేది కేవలం సీట్ల పెంపు వ్యవహారం కాదు. ఇది దేశ రాజకీయ సమీకరణాలను, రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని, మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని మార్చగల ప్రక్రియ. తెలంగాణలోనూ వచ్చే ఎన్నికల రాజకీయానికి కొత్త దిశానిర్దేశం చేయగలదు. అయితే, బిల్లుల ఆమోదం, రాజ్యాంగపరమైన ప్రక్రియలు, డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయాల తర్వాతే అసలు చిత్రం స్పష్టమవుతుంది. రాజకీయ పార్టీలు ముందస్తు వ్యూహాలకంటే ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడంపైనే దృష్టి పెట్టాలి.

Latest News

ఖిల్జీ వంశము (క్రీ.శ.1290-1320)|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

1286 లో బాల్బన్ మరణించిన తర్వాత ఢిల్లీలో కొంతకాలం పాటు రాజకీయ అనిస్థితి సంతరించుకుంది. బాల్బన్ కుమారుడు మహమ్మద్ మంగోలుల దాడిలో మరణించాక ఢిల్లీ సింహాసనంపై ఎవరు అంతగా ఆసక్తి చూపకపోవడంతో బాల్బన్...

నషా ముక్త్! నిషా యుక్త్!!|ADUGU BULLET

మాదక ద్రవ్యాల కట్టడి! కేంద్రం చేస్తుందట ముట్టడి!! నషా ముక్త్ భారత్ నినాదం! నిత్యం నిషాలో యువతరం!! అక్కడ.. ! ఇక్కడ..! డ్రగ్స్ లభించని చోటెక్కడ!? అంతటా దొరుకుతోంది గంజాయి! పోరగాళ్లు చేస్తున్నరు ఎంజాయి!! - క్రాంతి మిత్ర

ఎన్నికల్ల ఇచ్చినయి వసూలు సేసిండు!?|ADUGU TRENDS

ఎన్నికలంటేనే శిత్రం, యిశిత్రం. ఓటుకు ఓటే బలం. గందుకే గా ఓట్ల కోసం నాయకులు గాలం ఏత్తరు. గా గాలమే గీ పైసలు, శీరెలు, శారెలు, మందు, మాకులు. బీర్లు, బిర్యానీ ఇంకా...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

నవంబర్ 29 నుండి డిసెంబర్ 05 వరకు రాశి ఫలాలు మేష రాశి కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చే సమయం. ఉద్యోగ రంగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. పై అధికారులతో...

పాలకుర్తి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడ!?|PALAKURTHI|INTEGRATED SCHOOL

మంజూరై 18నెలలైనా ముహూర్తం కుదరలే పంచాయతీలే తప్ప పునాదిరాయి పడలే పూర్తవ్వాల్సిన స్కూల్ ఇంకా మొదలే కాలే కొడకండ్లలో పదో రోజుకు చేరిన దీక్షలు పాలకుర్తిలో ప్రారంభమవుతోన్న నిరసనలు నాయకుల పంతమా.. విద్యార్థుల భవిష్యత్తా? నేతల పట్టింపులు, పంతాలతో ప్రమాదంలో...

‘హస్త’ గతమే..నా!?|ADUGU BULLET

మళ్లీ మళ్లీ కాంగ్రెస్ కే అధికారం! మన సీఎం సారు చెప్పిండు జోస్యం!! కోటి ఓట్లు, 90 సీట్లు ఖాయమట! 2034 వరకు హస్తగతం తప్పదట!! బీజేపీ, బీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ! మోడీ, కేసీఆర్ తో...

రికార్డులకెక్కిన జగం మెచ్చిన వన గణపతి!?|ADUGU TRENDS

యినాకుని పండుగ దేశమంతటా జరుగుతది. ఇగ యినాకడునంగనే గా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తోటి శేసే రంగురంగుల పతిమలే గుర్తుకు వత్తయి. నిమజ్జనమప్పుడు గవాటిని శెరువుల్ల, కుంటల్ల యేసుట్ల పర్యావరణానికి ఆని జర్గుతాందని,...

ఢీలిమిటేషన్ ఆమోదానికి మార్గాంతరాలు!?|EDITORIAL

మహిళా రిజర్వేషన్లకు దేశవ్యాప్తంగా రాజకీయంగా సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ, డీలిమిటేషన్ విషయంలో రాష్ట్రాల ప్రయోజనాలు, రాజకీయ లెక్కలు అడ్డంకిగా మారుతున్నాయి. ఎన్డీఏకు సాధారణ మెజారిటీ ఉన్నా, రాజ్యాంగ సవరణకు అవసరమైన బలం లేదు....

నవంబర్ 28, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం కృష్ణపక్షం తిధి చవితి ఉదయం 11.55 వరకు ఉపరి పంచమి నక్షత్రం పునర్వసు సాయంత్రం 06.37 వరకు ఉపరి పుష్యమి యోగం శుక్ల రాత్రి 02.32 వరకు ఉపరి బ్రహ్మ కరణం బాలవ ఉదయం 11.55 వరకు ఉపరి...

‘అచ్ఛా’యా!?..ఇందిరమ్మ చీరలు!|ADUGU BULLET

కోటిమంది ఆడబిడ్డలకు రేవంత్ సర్కార్ ఇస్తోంది ఇందిరమ్మ చీరల కానుక!! నాడు కేసీఆర్ చేశాడుగా బతుకమ్మ చీరల వేడుక!! బీఆర్ఎస్ ఇచ్చిన చీరలు అప్పడు..అక్కా చెల్లెండ్లు కట్టలే! చీరలు పంచినా..‘ఛీ’వాట్లు తప్పలే!! కాంగ్రెస్ ఇస్తున్న చిలుక పచ్చ చీరలను తెలంగాణ...

ఆవ్వానం లేకుండొత్తే, జరిమానా, జైలు శిచ్చ!?|ADUGU TRENDS

ఒకప్పుడు కుటుంబ సంబంధాలు ఎంతో పకడ్బందీగా ఉండేయి. గా ఫెవికాల్, ఫెవికిక్ కంటే గట్టిగ అతికినట్టుండేయి. ఎవ్వలింట్ల ప్రభోజనమైనా, అందరిండ్లల్ల పండుగలెక్కనే ఉండేది. పొరపాటునో, గ్రహపాటునో ఎవర్నన్నా పిలుసుడు మరిసిపోతే, ఇగ భూగోళం...

‘ఢీ’లిమిటేషన్ కు మరోసారి మో‘ఢీ’!?|EDITORIAL

నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లుల ఆమోదానికి మోదీ సర్కార్ మరోసారి సిద్ధమైంది. మొదటిసారి దెబ్బతిన్న ప్రభుత్వం ఈసారి పకడ్బందీగా వ్యూహరచన చేస్తోంది. నవంబర్ 30 నుంచి లోక్‌సభ, డిసెంబర్ 2 నుంచి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News