ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం నుండి సామాజిక భద్రతా పింఛన్లను ఒక రోజు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలంలోని యలమందల గ్రామంలో అర్హులైన లబ్దిదారులకు పింఛన్లు అందజేస్తున్నారు. అనంతరం, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు సీఎం చంద్రబాబుతో సమావేశమై ముఖ్య సమస్యలు, జిల్లా అభివృద్ది తదితర అంశాలపై చర్చిస్తారు. తర్వాత 1:45 గంటలకు కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోనున్నారు. సాయంత్రం 3 గంటలకు ఆయన తన నివాసానికి ఉండవల్లి చేరుకుంటారు.
ఈ రోజు, రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. మొత్తం 63,77,943 మందికి రూ. 2717 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. 85.45 శాతం లబ్దిదారులకు పింఛన్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జీయో ట్యాగింగ్ ద్వారా పరిశీలిస్తున్నారు, దీనితో ప్రతి ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ అవుతాయన్న లక్ష్యంతో పింఛన్ల పంపిణీ జరుగుతోంది.

