ప్రత్యేక పూజలు నిర్వహించిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు
రాయపర్తి, జనవరి 15 (అడుగు న్యూస్)
రాయపర్తి మండలం, పెరికవేడు గ్రామంలో ప్రతి ఏడాది నిర్వహించే శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి జాతర ఘనంగా జరిగింది. ఈ జాతరకు పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి, ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు ఝాన్సీ రాజేందర్ రెడ్డిని సంప్రదాయ పద్ధతుల్లో సన్మానించారు. ఈ సందర్భంలో గ్రామ అభివృద్ధికి తన పూర్తి సహకారం అందిస్తానని, కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

