ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బ్రెజిల్‌కు చెందిన ఓ మహిళ తన కడుపులో క్యాప్సూల్‌ల రూపంలో డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పట్టుబడిన డ్రగ్స్ బరువు 802 గ్రాములు ఉండగా, వీటి మార్కెట్ విలువ సుమారు రూ. 12 కోట్లు ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.

