Wednesday, September 16, 2026
31.2 C
Hyderabad

జస్ట్ ఒక్క CICK|క్లిక్తో INDHIRAMMA|ఇందిరమ్మ HOUSES|ఇళ్ల స్టేటస్|STATUS చెక్ చేసుకోవచ్చు తెలుసా…?

TELANGANA|తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు మరింత సులభతరం చేసేలా ఒక కీలక ONLINE| ఆన్‌లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే తమ ఇళ్ల నిర్మాణం, బిల్లుల చెల్లింపు సంబంధిత పూర్తి INFORMATION| సమాచారాన్ని ఇంట్లో నుంచే తెలుసుకోవచ్చు.

ఇప్పటివరకు చాలా మంది లబ్ధిదారులు తమ ఖాతాలో నిధులు జమ అయ్యాయా లేదా అని తెలుసుకోవటానికి సంబంధిత కార్యాలయాలకు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. వెబ్‌సైట్‌లో కొత్త ఆప్షన్లు జోడించడం ద్వారా లబ్ధిదారులు తమ ఇంటి పురోగతి, బిల్లుల చెల్లింపు వివరాలు, ఆగిపోయిన పరిస్థితులు వంటి అన్ని అంశాలను స్పష్టంగా తెలుసుకోవచ్చు.

ప్రభుత్వం గుర్తించిన లబ్ధిదారులు ఇంటి పనులను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతుండగా, ప్రభుత్వం కూడా పనుల ప్రగతిని అనుసరించి నిధులను విడుదల చేస్తోంది. ప్రతి సోమవారం బిల్లుల చెల్లింపులు నిరంతరంగా కొనసాగుతున్నాయి. అయితే, బిల్లులు జమ అయ్యాయా లేదా అని ధృవీకరించుకోవటానికి లబ్ధిదారులు ఆఫీసుల వద్దకు రావడం వల్ల సమయం, శ్రమ వృథా అవుతుందని అధికారులు తెలిపారు.

ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం http://indirammaindlu.telangana.gov.in వెబ్‌సైట్‌ను మాడిఫై చేసి, లబ్ధిదారులు నేరుగా ఆన్‌లైన్‌లోనే స్టేటస్ చెక్ చేసుకునేలా సౌకర్యం కల్పించింది. హోమ్‌పేజీలో స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ లేదా అప్లికేషన్ నెంబర్ వంటి వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేస్తే, ఇంటి నిర్మాణ పురోగతి మరియు బిల్లుల చెల్లింపుల పూర్తి సమాచారం స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.

ఈ ఆన్‌లైన్ సదుపాయంతో లబ్ధిదారులు తరచూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఎక్కడి నుంచైనా తక్షణ సమాచారాన్ని పొందవచ్చు. ఇదే కాకుండా, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన సందేహాలు నివృత్తి చేయడం, ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రభుత్వం 040-29390057 టోల్ ఫ్రీ నెంబర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.

ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త డిజిటల్ సదుపాయంతో పథకం పారదర్శకత, వేగం పెరగడం తో పాటు, లబ్ధిదారుల సమయం, శ్రమలు గణనీయంగా ఆదా కానున్నాయి. ఇకపై ఒక్క క్లిక్‌తోనే తమ ఇంటి నిర్మాణం ఏ దశలో ఉందో, బిల్లులు ఎప్పుడు విడుదలయ్యాయో, చెల్లింపులు ఏ పరిస్థితిలో ఉన్నాయో లబ్ధిదారులు తెలుసుకోవచ్చు. ఈ నిర్ణయం లబ్ధిదారులకు ఎంతో మేలు చేస్తుందని అధికారులు చెప్తున్నారు

ఆ వెబ్సైట్ లింక్ ఇదే…
క్లిక్ చేసి మీ ఇందిరమ్మ ఇండ్ల స్టేటస్ తెలుసుకోండి..

http://indirammaindlu.telangana.gov.in

Latest News

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News