పని ఎంత పెద్దదైనా, శిన్న శిన్న శిట్కాలతోటి సిడెంల శేయొచ్చు. గా ఆటల పోటీలకు, ఎవలన్న ముక్యమైనోల్లు వచ్చినప్పుడు పట్టీలు, ముగ్గులు ఏత్తరు కదా? గయి ఏయాల్నంటే బొచ్చెడు పని మనుసులు, శానా టైం పడతాంటది. ఇగ గయన్ని లేకుండ ఇద్దరంటే ఇద్దరుంటే సాలు.. సాలు పొడుగునా మంచిగ గా ముగ్గులు పోసే ఇకమతు ఒకాయినె కనిపెట్టిండు. గదేందంటే…

ఒక్క తీర్గ సక్కగుండే, ఓ శిన్న బట్ట తున్క తీసుకున్నడు. గదాన్కి పొడుగ్గ దారం కట్టిండు. గదాన్ని గా ముగ్గు గదేనుల్లా… తెల్లరంగుల ముంచిండు. ఇగ గీత లెక్క ఏయాల్సిన మనుం పట్టిండు. ఇగ గా బట్ట తున్క మీద గా రంగు పోసుకుంట ఇంకోయానె నడుస్తాండు. సూత్తాంటే గా రంగుట పట్టీలు పడిపోతానయి. గంతే. ఓ

