వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మొదటి నామినేషన్ దాఖలైంది. ప్రజా వాణి పార్టీ తరఫున లింగిడి వెంకటేశ్వర్లు నామినేషన్ పత్రాలను సమర్పించారు. సోమవారం, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రంలో, జిల్లా కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠికి ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు.

