Saturday, August 1, 2026
29.7 C
Hyderabad

తెలంగాణలో AI ఆధారిత డిజిటల్ విద్య అమలుకు ప్రణాళిక

తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యను విప్లవాత్మకంగా అభివృద్ధి చేసేందుకు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డిజిటల్ విధానాలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో, విద్యార్థులకు అధునాతన శిక్షణ అందించేందుకు పాఠశాల విద్యా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎక్ స్టెప్ ఫౌండేషన్ ను విద్యా శాఖ కార్యదర్శి డా. యోగితా రాణా నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈరోజు (జనవరి 30) సందర్శించింది. ఈ బృందంలో ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహా రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్లు ఉమా హారతి, గరిమ తదితరులు పాల్గొన్నారు.

ఎక్ స్టెప్ ఫౌండేషన్ – AI ఆధారిత విద్యకు కీలక భాగస్వామి

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని స్థాపించిన ఎక్ స్టెప్ ఫౌండేషన్ ఇప్పటికే గుజరాత్, కర్ణాటక, ఒడిశా, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో డిజిటల్ పరిష్కారాలను అందించడంలో ఈ సంస్థ ప్రముఖంగా పనిచేస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం ఎక్ స్టెప్ ఫౌండేషన్‌తో కలిసి తీసుకునే ముఖ్య నిర్ణయాలు:ఫౌండేషనల్ లిటరసీ, న్యూమెరసీ (FLN) – ప్రాథమిక విద్య స్థాయిలో AI ఆధారిత డిజిటల్ పద్ధతుల ద్వారా విద్యార్థుల పఠన, లేఖన, గణిత నైపుణ్యాల పెంపు.

AI ఆధారిత డిజిటల్ ఇనిషియేటివ్స్ – ప్రత్యేకమైన టూల్స్, ప్లాట్‌ఫామ్స్ ద్వారా విద్యార్థుల వ్యక్తిగత అభ్యాసాన్ని మెరుగుపర్చడం.

డేటా ఆధారిత విశ్లేషణ (Data-Driven Insights) – విద్యార్థుల లోపాలను గుర్తించి, విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే చర్యలు తీసుకోవడం.

ఉపాధ్యాయుల శిక్షణ – తరగతి గదుల్లో డిజిటల్ టెక్నాలజీని సమర్థంగా వినియోగించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ అందించడం.

కేరళ మోడల్ ను తెలంగాణలో అమలు

2024లో కేరళ విద్యా విధానాన్ని పరిశీలించిన తెలంగాణ ప్రతినిధి బృందం, ఆ రాష్ట్రంలో AI ఆధారిత టూల్స్ వినియోగం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించినట్లు గుర్తించింది. ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ ను తెలంగాణ విద్యా రంగంలో కూడా అమలు చేయాలని నిర్ణయించారు.

ఎక్ స్టెప్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో, తెలంగాణ ప్రభుత్వం సమగ్ర AI ఆధారిత విద్యా ప్రణాళిక రూపొందిస్తోంది. విద్యార్థులకు స్నేహపూర్వక అభ్యాస పద్ధతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, డిజిటల్ విద్యా ప్రమాణాల పెంపు రంగాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.

 

Latest News

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News