ఇల్లంటే సల్లంగుండాలె. ఎటు గాలి గటే పోవాలె. గట్లని కోతులు, పిట్టలు, పశుపచ్చాదులతోటి పరేషాన్లుండొద్దు. ఇగ గిట్ల నిమ్మలంగుండాలంటే, ఇల్లెట్ల కట్టుకోవాలె? ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలె! గసొంటిదే గీ కిటికీలకు స్లైడింగ్ తెరలు. కర్సు తక్కువ. పాయిదా ఎక్కవన్నట్లు.

ఇంటికి కిటికీలు, బాల్కనీలకు పెడ్తం కద. గవాటికి గిప్పుడు ఖరీదైన తలుపులు, గ్రిల్స్ కట్టి, అద్దాలు పెడుతున్నరు. గా కర్సు తగ్గించే మంచి ఉపాయం ఓ అన్న శేసిండు. గవాటికి బదులు స్లైడింగ్ తెరలు పెట్టిండు. ఇగ గవాటిని తెరుసుడు, మూడుసు సలువు. ఎండా, వానా, సలి గూడ రాదు. ఇగ గవాట్లకెల్లి కోతులు పోవు. కిటికీల దగ్గర పిట్టలు, పావురాలు అసొంటి పచ్చులు కూడా ఆలవు. ఇగ ఏ బెడదా లేకుండా మంచిగుంటదన్నట్లు. మీరూ శేసి సూడుండ్రి.

