Wednesday, September 16, 2026
30.2 C
Hyderabad

‘ఫీల్ గుడ్’ గుండు సున్నా కావద్దు!|EDITORIAL

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక విజయంతో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంపై ఉన్న సందేహాలు కొంతమేరకు వీడిపోయినా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. గెలుపును బలుపుగా తీసుకుని సమస్యలను విస్మరించరాదు. విజయం ధైర్యాన్నివ్వాలి. కానీ, అహంకారానికి తావివ్వకూడదు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం మరింత సమర్థవంతంగా పని చేయడం, ప్రగతి ప్రభావాన్ని ప్రజల అనుభవంలోకి తేవడం ప్రభుత్వం, సీఎం ప్రథమ కర్తవ్యం కావాలి.

మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక విజయంతో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంపై ఉన్న సందేహాలు కొంతమేరకు వీడిపోయినా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నాయకుల అహంకారం, బండి సంజయ్‌ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం వంటి పరిణామాలతో ఏర్పడిన వాతావరణం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారింది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ లు కుమ్మక్కయ్యాయనే ప్రచారం కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయంగా ముందుకు తెచ్చింది. ఇదే కొనసాగుతూ, గత రెండు ఉపఎన్నికలు కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్ కాంగ్రెస్‌కు విజయం చేకూర్చాయి. ఈ వాతావరణాన్ని సానూలంగా మలచుకున్న రేవంత్‌ వ్యూహాలు ఈ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాయి.
ఈ విజయాలను ప్రజాపాలనపై ‘ఫీల్ గుడ్’ గా తీసుకోవడానికి లేదు. ప్రభుత్వం పదేపదే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నట్లు ప్రచారం చేస్తోంది. వాటి ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరడంలేదు. ధరణి రద్దయి భూమాత వచ్చినప్పటికీ, భూ సమస్యలు అలాగే ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు, 1బి రికార్డులు, సెటిల్మెంట్ సంబంధిత అయోమయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థాయిలో భూ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది.

దేవాదాయ శాఖ దైవాదీనంగా మారింది. వేలాది ఎకరాల ఆలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. కానీ ఆ శాఖ మంత్రి కొండా సురేఖ వాటి గురించి కనీస అవగాహన లేకుండా వ్యవహరిస్తుండటం ఆందోళనకరం. అటవీ భూముల విషయంలోనూ ఇదే పరిస్థితి. ఆక్రమణలు, పోడులు కొనసాగుతూనే ఉన్నాయి.

రోడ్ల పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయి. వరంగల్‌ హైవేపై పెద్దగా పనులు చేపట్టకపోవడం ప్రజలను విసిగిస్తోంది. పౌరసరఫరాలలో తెల్ల రేషన్‌ కార్డు దుర్వినియోగం, రేషన్‌ బియ్యంతో దొంగ వ్యాపారం వంటి అంశాలను మంత్రి పట్టించుకోవడం లేదు. తగిన దృష్టి పడకపోవడం సమస్యలను మరింత తీవ్రమయ్యేలా చేస్తోంది.
ఉద్యోగుల పనితీరుపై కూడా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. లంచం లేనిదే పనులు జరగడం లేదని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఏసీబీ దాడులతోనూ, ఉద్యోగుల్లో మార్పు కనిపించడం విచిత్రం, విడ్డూరం. ఫీ రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ దోపిడీలు ప్రభుత్వానికీ పెను సవాలుగా నిలుస్తున్నాయి. మంత్రులు, శాఖలు, ఉద్యోగులు తమ విధుల పట్ల నిర్లక్ష్యంతోపాటు, అవినీతికి అలవాటు పడ్డారన్న భావన ప్రజల్లో కలుగుతోంది. పాలన ప్రభావం ప్రభుత్వంపై పడుతుంది. ప్రభుత్వ బాధ్యత సీఎం ది. రేపటి పరిణామాలన్నీ సీఎం యే ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచీ, చెడు ఆయన ఖాతాలోకే కాబట్టి ఆయన క్రియాశీలకంగా స్పందించకపోతే వాటి పర్యవసానాలను భరించాల్సి వస్తుంది.

ఒక ఉప ఎన్నిక రాష్ట్రం మొత్తం ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించదు. కొంత మేరకు ఆ ప్రభావాన్ని చూపుతుందంతే. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక గెలిచినంత మాత్రాన ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని భావించడం ప్రమాదకరం. ఉపఎన్నికల్లో పార్టీ, ప్రభుత్వం మొత్తం శక్తిని కేంద్రీకరించడం వల్లే సాధ్యం అయింది. సాధారణ ఎన్నికల్లో ఇలా జరగదు. వనరులు, పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ వ్యతిరేకతను ఇప్పుడే గుర్తించకపోతే మూడేళ్ల తరువాత అది పెరిగి, పెద్దదై ప్రభుత్వాన్నే దగ్దె దించేయవచ్చు.

రేవంత్‌ ప్రస్తుతం పార్టీలో, ప్రభుత్వంలోనూ తన పట్టును ఒడిసిపట్టుకున్నారు. ప్రజాభిమానాన్ని పొందడానికి ఇంకా సుదూరం ప్రయాణించాల్సి ఉంది. సమస్యలను నేరుగా గుర్తించి వెంటనే పరిష్కరించడం తప్పనిసరి. మంత్రులు, అధికారులు సత్వరమే స్పందించి, బాధ్యతాయుతంగా మెలిగేలా కఠిన చర్యలు తీసుకోవాలి. సమీపిస్తున్న ఎన్నికల రీత్యా, స్థానిక, మున్సిపల్, జీహెచ్ఎంసీల సమస్యలను పరిష్కరించడం ద్వారా ఓటర్ల విశ్వాసాన్ని తిరిగి పొందవచ్చు.

బిహార్‌ ఫలితాలతో కాంగ్రెస్‌ జాతీయ స్థాయిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో తెలంగాణలో రేవంత్‌రెడ్డి విజయం పార్టీకి ఊపిరి పోసింది. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఆయన ప్రతిష్ఠను పెంచింది. కానీ, ఈ విజయాలే రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పులు తెచ్చేవేమీ కావు. రేవంత్‌ ఇకపై మరింత ప్రజల మధ్యకు వెళ్లి, సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, పరిష్కరిస్తేనే, తన నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవచ్చు.
గెలుపును బలుపుగా తీసుకుని సమస్యలను విస్మరించరాదు. విజయం ధైర్యాన్నివ్వాలి. కానీ, అహంకారానికి తావివ్వకూడదు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం మరింత సమర్థవంతంగా పని చేయడం, ప్రగతి ప్రభావాన్ని ప్రజల అనుభవంలోకి తేవడం ప్రభుత్వం, సీఎం ప్రథమ కర్తవ్యం కావాలి.

Latest News

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News