ఎండాకాలం రానే వచ్చె. పెనంల కెళ్ళి పొయ్యిల పడ్డట్టు, కుమ్ముల పెట్టినట్లు మలమల మాడి, ఉడికిపోబడితిమి. ఇగిప్పుడు ఏసీ టైమొచ్చింది. ఏసీల గిరాకీ, ధరలు సూత్తే అవి గూడ మండిపోబట్టే. ఇగ మద్దె తరగతొల్లకి గా కూలర్లే దిక్కాయె! మరి గా కూలర్లు ఏసీల్లెక్క సల్ల…గ గాలి కొట్టాల్నంటే ఏం శేయాల్నో గీ రెండు శిట్కాలు శెప్త ఇనుండ్రి.

కూలర్ల పోసే నీల్లల్ల పటికె ఏయాలె. గా పటికెతోటి గా నీల్లు సల్లంగైతయి. గట్లనే ఓ రెండు మూడు నీల్ల సీసాలు తీస్కోవాలె. గవాట్ల గింతంత ఉప్పేసి నీల్లు నింపాలె. గవాటిని డీప్ ప్రజ్జుల పెట్టాలె. గట్టిగ గడ్డకట్టినట్లైనంక, గా సీసాలను తీసి కూలర్ నీల్లల్ల ఏయాలె. గట్ల సేత్తే గా గడ్డకట్టిన సీసల నీల్లు తొందరగ కరగయి. శానా సేపు, ఇగ గా కూలర్ నీల్లు సల్ల గైతయి. ఏసీ కంటే ఎక్కువగ సల్లగాలి కొడ్తయి. ఎట్లున్నయి గీ మిడిమిడి మద్దె తరగతికి మంచి శిట్కాలు?
ఏసీల్లెక్క కూలర్ గాలికి గీ శిట్కాలు!?|ADUGU TRENDS

