Friday, May 15, 2026
38.2 C
Hyderabad

గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్ల కోసం చట్టం – ప్రజాభిప్రాయానికి ముసాయిదా

తెలంగాణ రాష్ట్రంలో గిగ్ మరియు ప్లాట్‌ఫాం వర్కర్లకు భద్రత కల్పించే చట్టం ముసాయిదాను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ బిల్లును ప్రజాభిప్రాయానికి అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తుది ముసాయిదాను రూపొందించాలని సూచించారు. ఈ నేపథ్యంలో సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన గిగ్ వర్కర్లు, యూనియన్ల ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ కార్మిక శాఖ రూపొందించిన బిల్లులో గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా, ఇతర హక్కులు కల్పించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం డిసెంబర్ 30, 2023న గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా అమలు చేసిన సంగతి గుర్తు చేశారు. బిల్లు దేశానికి మార్గదర్శకంగా ఉండేలా రూపొందించాలని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజల సలహాలు, సూచనలు బిల్లుకు కీలకమని సీఎం తెలిపారు. ఫుడ్ డెలివరీ, క్యాబ్ డ్రైవర్లు, ప్యాకేజింగ్ డెలివరీ వర్కర్లతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారని తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకు తుది ముసాయిదాను సిద్ధం చేసి, మే 1 (మేజీ) నాటికి కొత్త చట్టాన్ని అమల్లోకి తేవాలని అధికారులను ఆదేశించారు.

 

Latest News

కిటికీలకు స్లైడింగ్ తెరలు!?|ADUGU TRENDS

ఇల్లంటే సల్లంగుండాలె. ఎటు గాలి గటే పోవాలె. గట్లని కోతులు, పిట్టలు, పశుపచ్చాదులతోటి పరేషాన్లుండొద్దు. ఇగ గిట్ల నిమ్మలంగుండాలంటే, ఇల్లెట్ల కట్టుకోవాలె? ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలె! గసొంటిదే గీ కిటికీలకు స్లైడింగ్ తెరలు....

కాన్వాయ్‌లు కాదు, రాజకీయ దుబారాలు!|EDITORIAL

ప్రజల జీవితాలను కష్టాల్లోకి నెట్టడం పొదుపు కాదు. ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న వ్యర్థ వ్యయాలను తగ్గించడం. ప్రజలు త్యాగాలు చేయాలని కోరే నాయకులు ముందుగా తమ ఉచిత సదుపాయాలు, అలవెన్సులు, విలాసాలను తగ్గించుకోవాలి....

15-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి బ త్రయోదశి ఉదయం 06.00 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం అశ్విని సాయంత్రం 06.51 వరకు ఉపరి భరణి యోగం ఆయుష్మాన్ మధ్యాహ్నం 12.58 వరకు ఉపరి సౌభాగ్య కరణం వణజి...

కరెంటు తీగల మద్దెలనే ఇల్లు!?|ADUGU TRENDS

కాని కట్టాలు రానీ, కరెంటు తీగలుంటే, గవాటి కింద మనం ఇల్లే కట్టం. గా ఆలోశెన కూడా శేయం. కనీ, గీ అన్న కరెంటు తీగల మద్దెలనే ఇల్లు కట్టిండు! గీ అన్న...

‘నీట్’ గా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం!|EDITORIAL

పరీక్షల నిర్వహణలో ఇలాంటి వైఫల్యాలు చోటుచేసుకోవడం కేవలం పరిపాలనా నిర్లక్ష్యం కాదు. ఇది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రమాదకరమైన ఆటాడుకోవడమే. నీట్ పేపర్ లీక్ మాఫియాను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చట్టాలు తేవాలి. ఎన్‌టిఏ...

14-05-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి ఉదయం 07.39 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం రేవతి రాత్రి 07.55 వరకు ఉపరి అశ్విని యోగం ప్రీతి మధ్యాహ్నం 03.25 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం తైతుల ఉదయం...

ఒక శెట్టుకు 234 రకాల మామిడి పండ్లు!?|ADUGU TRENDS

గిదేం ఇచ్చెంత్రం అని ఆశీరపోతుండ్రా!? నిజంగా ఇది నిజమేనుల్లా! గీ శెట్టుకు 234 రకాల మామిడి పండ్లు కాసినయి. గా శెట్టు దగ్గర నిల్సోని సాక్షాత్తు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహానే...

పొదుపు ఎక్కడి నుండి పొడవాలి?|EDITORIAL

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే ఖర్చులను తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలి. బంగారం కొనుగోళ్లను నియంత్రించాలి. దేశీయ ఉత్పత్తుల...

13-05-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి ఉదయం 08.53 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.38 వరకు ఉపరి రేవతి యోగం విస్కమ్బ సాయంత్రం 05.39 వరకు ఉపరి ప్రీతి కరణం బాలవ ఉదయం...

ఏటీఎం లోపల సవురం!?|ADUGU TRENDS

ఇగ ఏటీఎంల ఏముంటది? ఓ మిషిని ఉంటది. గదాంట్ల ఏముంటయి? రుపాలుంటయి. మరిగ గిదీంట్ల ఏమున్నది ముచ్చట? ఉందుంది.. గదేందో మీరే సూడుండ్రి. సదువుండ్రి. గా ఏటీఎంల ఓ మనిసికి ఇంకో మనిసి సవురం...

సర్… అనుమానాలెందుకు!?|EDITORIAL

సర్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందా? ఎన్నికల సంఘం సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తున్నదా? ఇప్పటి డిజిటల్ యుగంలో ఒక వ్యక్తికి ఒకే ఆధార్ నంబర్, ఒకే పాన్ కార్డు, ఒకే పాస్‌పోర్ట్ ఉంటున్నాయి....

12-05-2026 మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం హనుమజ్జయంతి తిధి బ దశమి ఉదయం 09.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి 08.48 వరకు ఉపరి ఉత్తరాభాద్ర యోగం వైధృతి రాత్రి 07.28 వరకు ఉపరి విష్కమ్బ కరణం భద్ర ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News