కురులంటే నెత్తింటికలు. కేశాలు. ఎంట్రుకలను ఎన్కటికి కవులు కారుమబ్బులతోటి పోల్చిండ్రు. కావ్యాల్ల కలువల సమూహంతోటి పోల్చిండ్రు. ఎంట్రుకలకు పూల సుగంధాలు అద్దడం పరిపాటే. కల్పవృక్షాల పరిమళాలు దేవతల తలవెంట్రుకల నుండి వెలువడుతున్నట్లు వర్ణించడం కావ్యాల్లో కనిపిస్తది. స్త్రీ అందానికి, వారి ఆత్మ గౌరవానికి కురులు ప్రతీక. మహాభారతంల ద్రౌపది ఎంట్రుకలు ఆమె పరాభవానికి, ఆ తర్వాత జరిగిన ప్రతీకార పోరాటానికి ముడిపడ్డయి. అసలు జడలు, ముడులు భారతీయ సంప్రదాయంల పవిత్రతకు, ధ్యానానికి గుర్తులుగా భావిస్తరు. గిదంతా ఎందుకంటే, గియన్ని గిట్లుండంగా ఒకామె ఆమెకంటే పొడవైన ఎంట్రుకలు పెంచి గిన్నీస్ రికార్డులకెక్కింది. నెత్తెoటికెలు ఊసిపోయి, బట్ట గుండై గుండె కొందరికి గుభేల్ అంటుంటే, గీమె మాత్రం జుట్టు పెంచి రికార్డులతో వయ్యారాలు పోతాంది.

గామెది ఉత్తరాఖండ్ రాష్ట్రం. పేరు రేణూ ధారియాల్. నెత్తి ఎంట్రుకలను 8 అడుగుల 10 అంగుళాలు పెంచింది. గిన్నీస్ రికార్డులకెక్కింది. గామె 2015 నుండి జుట్టు కత్తిరించుకోలేదట! ఇగ, గీ ఈడియో మస్తు వైరలైతాంది!

