Sigachi|సిగాచీ Pharma|ఫార్మా Accident|ప్రమాదంలో Couple|దంపతులు Death|దుర్మరణం
Sangareddy|సంగారెడ్డి District|జిల్లా Pashamailaram|పాశమైలారంలోని సిగాచీ ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం అనేక Families|కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సోమవారం ఉదయం చోటుచేసుకున్న రియాక్టర్ పేలుడు కారణంగా ఇప్పటివరకు 45 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడగా, వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరో 27 మంది గల్లంతయ్యారు.
ఈ ప్రాణాంతక ఘటనలో మృతుల్లో రెండు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న New Couple|కొత్త జంట కూడా ఉంది. kadapa|కడప జిల్లా Jammalamadugu|జమ్మలమడుగుకు చెందిన నిఖిల్రెడ్డి, ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన నామాల శ్రీరమ్య ఇద్దరూ ప్రేమలో పడి ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆషాడ మాసం తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ వేడుకను ఘనంగా నిర్వహించుకోవాలనే అభిలాషను పెంచుకున్నారు.
అయితే దురదృష్టవశాత్తూ, సిగాచీ ఫార్మా పేలుడు వారి కలలన్నిటిని ఛిన్నాభిన్నం చేసింది. ఈ విషాదకర ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో వారి గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కొత్త జీవితం ప్రారంభించిన దంపతుల అనుకోని ముగింపు రెండు కుటుంబాలను శోక సంద్రంలో ముంచేసింది.

