Monday, July 13, 2026
29.3 C
Hyderabad

వికసిత్ భారత్|VIKASITH BHARAT లక్ష్య సాధనలో తెలంగాణ|TELANGANA

NITI AAYOG|నీతి అయోగ్ సమావేశంలో సీఎం|CM రేవంత్ రెడ్డి|REVANTH REDDY

దేశాన్ని 2047 నాటికి నెంబర్ వన్ సూపర్ పవర్‌గా మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పాన్ని అభినందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదే స్పూర్తితో తెలంగాణ అభివృద్ధికి “TELANGANA RAISING|తెలంగాణ రైజింగ్ – 2047” ప్రణాళికను రూపొందించామని వెల్లడించారు. శనివారం నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం దేశం దృష్టిని ఆకర్షించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం చేపట్టిన “ఆపరేషన్ సిందూర్|OPERATION SINDOOR” విజయవంతంగా పూర్తవడం పట్ల మోదీ, భారత సైన్యానికి అభినందనలు తెలియజేశారు. 1971లో ఇందిరా గాంధీ నాయకత్వంలో పాకిస్తాన్‌ను ఓడించి, దేశాన్ని రెండు భాగాలుగా విభజించిన చరిత్రను గుర్తు చేశారు.|VIKASITH BHARAT|TELANGANA|NITI AAYOG|CM|REVANTH REDDY|TELANGANA RAISING|OPERATION SINDOOR|SPEECH

తెలంగాణ అభివృద్ధి దిశగా ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోందని, అన్ని రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో “తెలంగాణ రైజింగ్ – 2047” డాక్యుమెంట్ రూపొందించామని తెలిపారు. ఇందులో పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, పారదర్శక పాలన వంటి నాలుగు కీలక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం లక్ష్యంగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నదని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్‌లు, ఎస్సీల ఉపవర్గీకరణ వంటి నిర్ణయాలను దేశంలో తొలిసారిగా అమలు చేసిన ఘనత తెలంగాణకే దక్కుతుందన్నారు.|VIKASITH BHARAT|TELANGANA|NITI AAYOG|CM|REVANTH REDDY|TELANGANA RAISING|OPERATION SINDOOR|SPEECH

తెలంగాణలో వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలు ఇప్పటికే అమలులో ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, తెలంగాణ తన అనుభవాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో విధానాలు రూపొందించామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.లక్ష కోట్ల రుణాలు, పాఠశాలల నిర్వహణ బాధ్యతలు మహిళా సంఘాలకివ్వడం వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు పేర్కొన్నారు.|VIKASITH BHARAT|TELANGANA|NITI AAYOG|CM|REVANTH REDDY|TELANGANA RAISING|OPERATION SINDOOR|SPEECH

సోలార్ పవర్ జనరేషన్‌లో మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తూ వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో మహిళల ప్రోత్సాహానికి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. యువతే దేశ భవిష్యత్తు అని, వారి ఆశయాల సాధన కోసం యూత్ పాలసీ అమలులో ఉందన్నారు. ఇప్పటివరకు 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలు సృష్టించామని చెప్పారు. నైపుణ్యాల కొరత కారణంగా నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యంలో, యువతకు ఆధునిక స్కిల్ శిక్షణ కోసం స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, పోలీస్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్, ఐటీఐలను ఆధునీకరించినట్లు వివరించారు.|VIKASITH BHARAT|TELANGANA|NITI AAYOG|CM|REVANTH REDDY|TELANGANA RAISING|OPERATION SINDOOR|SPEECH

తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా మార్చే లక్ష్యంతో రాష్ట్రం ముందుకు సాగుతోందని, మాదకద్రవ్యాల నిర్మూలనలో 139 దేశాల్లో నెంబర్ వన్‌గా నిలిచిన ఘనతను పొందినట్లు గుర్తు చేశారు. జూన్ 2 నుంచి “రాజీవ్ యువ వికాసం” పథకం ద్వారా యువతకు రూ.5 లక్షల స్వయం ఉపాధి మద్దతు అందించనున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమం ప్రభుత్వానికి ముఖ్య ప్రయోజనమని, అప్పుల ఊబిలో నుంచి రైతులను బయటకు తీయాలనే లక్ష్యంతో 25.35 లక్షల మందికి రూ.20,616 కోట్లు రుణమాఫీ చేశామని చెప్పారు. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా, క్వింటాల్ బియ్యానికి అదనంగా రూ.500 చెల్లించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. వ్యవసాయ కూలీలకూ రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు.|VIKASITH BHARAT|TELANGANA|NITI AAYOG|CM|REVANTH REDDY|TELANGANA RAISING|OPERATION SINDOOR|SPEECH

తెలంగాణ ప్రస్తుతం వరి ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉందని, గత ఏడాది 2.90 కోట్ల టన్నుల ఉత్పత్తి నమోదై ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. వ్యవసాయ వ్యయాన్ని సంక్షేమ ఖర్చుగా కాకుండా, ఆహార సంపదకు పెట్టుబడిగా చూడాలని దేశాన్ని కోరారు. తెలంగాణ రైజింగ్ – 2047 దిశగా పరిశ్రమలు, మౌలిక సదుపాయాల్లో అంతర్జాతీయ స్థాయికి చేరాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. అమెరికా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్ దేశాల్లో పర్యటించి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చామని తెలిపారు.|VIKASITH BHARAT|TELANGANA|NITI AAYOG|CM|REVANTH REDDY|TELANGANA RAISING|OPERATION SINDOOR|SPEECH

రాష్ట్రాన్ని కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ జోన్లుగా విభజించి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని, ముసీ రివర్ ఫ్రంట్, మెట్రో రైల్ ఫేజ్-2, ఫ్యూచర్ సిటీ, మాన్యుఫాక్చరింగ్ హబ్, అగ్రిబేస్డ్ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సబర్మతీ రివర్ ఫ్రంట్, గంగా పునరుద్ధరణ ప్రాజెక్టుల మాదిరిగా ముసీ నది పునరుద్ధరణ ప్రణాళిక ఉందని పేర్కొన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, డ్రై పోర్ట్ నుండి మచిలీపట్నం పోర్టుకు ఎక్స్ ప్రెస్ హైవే వంటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యమైనవని తెలిపారు.|VIKASITH BHARAT|TELANGANA|NITI AAYOG|CM|REVANTH REDDY|TELANGANA RAISING|OPERATION SINDOOR|SPEECH

గుడ్ గవర్నెన్స్ లక్ష్యంగా BUILD NOW యాప్ ద్వారా నిర్మాణ రంగాన్ని వేగవంతం చేశామని, హైదరాబాద్‌ను డేటా సెంటర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని అన్నారు. విద్య, వైద్యంలో అంతర్జాతీయ ప్రమాణాల లక్ష్యంతో ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.|VIKASITH BHARAT|TELANGANA|NITI AAYOG|CM|REVANTH REDDY|TELANGANA RAISING|OPERATION SINDOOR|SPEECH

“వికసిత భారత్ లక్ష్య సాధన మనందరి కల. ఆ కలను నిజం చేయడంలో తెలంగాణ ముఖ్యపాత్ర పోషిస్తుందన్నది మా ఆశయం. ‘నేషన్ ఫస్ట్ – పీపుల్ ఫస్ట్’ సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నాం. రాష్ట్రాల సమాఖ్య అయిన భారత దేశంలో కేంద్రం సహకారం లేకుండా తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదు. తెలంగాణ రైజింగ్ విజన్‌కు కేంద్రం సహకరించాలి. వికసిత భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ ముందున్న రాష్ట్రంగా నిలుస్తుందని హామీ ఇస్తున్నా” అంటూ సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.|VIKASITH BHARAT|TELANGANA|NITI AAYOG|CM|REVANTH REDDY|TELANGANA RAISING|OPERATION SINDOOR|SPEECH

Latest News

శ్రీ బీరన్న స్వామి బోనాల ఆహ్వానం..|INVITATION|BEERANNA SWAMY

మంత్రి కొండా సురేఖను కలిసిన కమిటీ సభ్యులు|MINISTER|KONDA SUREKHA వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కరీమాబాద్ శ్రీ బీరన్న స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...

జూలై 13, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 06.23 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 03.40 వరకు ఉపరి పునర్వసు యోగం ధ్రువ సాయంత్రం 04.58 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 07.40...

మర మనుసులతోటి ఆపరేషన్లు!?|ADUGU TRENDS

ఆపరేషన్లు ఎవలు శేత్తరు? ఏ తియ్ గిది తెల్వదా? డాక్టర్లే శేత్తరు. మరి గా యంత్రాలే శేత్తే? గిది అంతుశిక్కని ఆలోశనే కదా? గీ మద్దెల మర మనుసులు గదేనుల్లా మనుసుల్లెక్కనే ఉండే...

ఇదేంటి ‘సర్’!?|EDITORIAL

‘సర్’ ప్రధాన ఉద్దేశం మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పులు నమోదు చేయడం, నకిలీ నమోదులను తొలగించడం, ఓటరు జాబితాను మరింత విశ్వసనీయంగా రూపొందించడం. పీఎం., సీఎం నుంచి సాధారణ పౌరుడి...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 12 నుండి జూలై 18 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో...

పుట్టిన రోజుకు కోళ్లను పంచిండు!?|ADUGU TRENDS

ఎవ్వలైనా పుట్టిన రోజుకు బవుమతులు తీసుకుంటరు. ఇయ్యరు. గీ మద్దెలనే ఇచ్చే పద్ధతి కూడా వచ్చిందనుకోండ్రి. ఒకేల ఇచ్చినా, ఏ కేకులనో, ఏ మిఠాయి డబ్బలనో, ఏదన్న వస్తువులనో పంచుతరు. కనీ, గీయినేం...

నీటి భరోసా ఏది!?|EDITORIAL

తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. తాజాగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు...

జూలై 11, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.20 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం కృత్తిక ఉదయం 08.35 వరకు ఉపరి భరణి యోగం గండ రాత్రి 11.01 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 12.30 వరకు ఉపరి...

నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది!?|ADUGU TRENDS

అవుమల్ల.. మీరు సదివింది నిజమేనుల్లా! నిజంగా నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది? ఎటువంటి పతికూల పరిస్థితుల్ల గూడ గిది ఆగిపోదు. గిదీన్ని అంతరిక్ష పోను గదే, శాటిలైట్ పోను...

వ్యవ‘సాయ’మేది!?|EDITORIAL

ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్లు, వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా...

జూలై 10, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి రాత్రి 01.41 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం భరణి ఉదయం 10.01 వరకు ఉపరి కృత్తిక యోగం శూల రాత్రి 02.00 వరకు ఉపరి గండ కరణం బవ మధ్యాహ్నం 02.46 వరకు ఉపరి...

చారిత్రక పూర్వయుగ సంస్కృతులు|HISTORY|ADUGU SPECIAL|COMPITITVE|EXAMS

(ఆది నుండి క్రీ.పూ.2500 వరకు) లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా మన చరిత్రకారులు విభజించారు. 1) చారిత్రక పూర్వయుగం (Pre-historic Age). 2) చారిత్రక సంధియుగం (Proto-historic Age) 3) చారిత్రక యుగం (Historic Age) 1)...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News