బర్డ్ ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సరిహద్దుల్లో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఏపీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కోళ్ల దిగుమతిని నిరోధించేందుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ మేరకు శుక్రవారం అశ్వారావుపేట రాష్ట్ర సరిహద్దులో పోలీస్, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో అదనపు సంచాలకుడు డాక్టర్ ప్రదీప్ కుమార్ ప్రత్యేక చెక్ పోస్ట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ, పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొని చర్యలు చేపట్టారు.

