Wednesday, September 16, 2026
29.4 C
Hyderabad

ఆపరేషన్‌ సిందూర్‌ -2

తోక ముడిచిన పాక్!
పాక్‌ అతలాకుతలం!!
రక్షణ వ్యవస్థలు కకావికలం!
భారత్‌ దాడుల్లో ఇస్లామాబాద్‌ సర్వనాశనం!
అజ్ఞాతంలోకి పాక్‌ ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌!?
పఠాన్‌కోట్‌ సెక్టార్‌లో పాక్ ఫైటర్‌ జెట్ల కూల్చివేత!
కర్కశ ముష్కరులపై ముప్పేట దాడి..
లాహోర్‌, సియోల్‌కోట్‌పై ప్రతి దాడి
పాకిస్తాన్‌పై మొదలైన భారత్ దాడులు
కరాచీ ఓడరేవు సమీపంలో పేలుళ్లు!
భారత్‌ దాడిలో ధ్వంసమైన 8 క్షిపణులు, 16 డ్రోన్లు!
సైరన్‌ల మోతతో ఠారెత్తిన పాక్ పురవీధులు!
భారత సైన్యం అదుపులో పాక్‌ పైలెట్‌
మన సైనిక స్థావరాలపై దాడికి విఫలయత్నాలు
పాక్ పన్నాగాలను తిప్పికొట్టిన భారత సైనికులు
రెడ్‌ అలర్ట్ లో రాజస్థాన్‌ సరిహద్దు జిల్లాలు
రెండు దేశాల మధ్య భీకర యుద్ధ వాతావరణం!
ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న భారత ప్రధాని, రక్షణ మంత్రి
దేశంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

మరోవైపు పాక్ లో అంతర్యుద్ధం!
పారిపోతున్న పాక్ సైన్యం!
రిమోట్ బాంబులతో మొబైల్‌ టవర్లు ధ్వంసం!
పాక్ సైనికులపై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు
పాక్‌ సైనికుల ఆయుధాలు, ఆహారం ట్రక్కులు పేల్చివేత
పాక్‌పై ఆరు దాడులు చేశామంటున్న బలుచిస్తాన్ ఆర్మీ

‘వార్’ వన్ సైడే అయింది. ఆపరేషన్ సిందూర్ రెండో రోజే పాక్ తోక ముడిచింది. ముశ్కర మూకలపై జరుగుతున్న ముప్పేట దాడితో రక్షణ వ్యవస్థలు కకావికలమైంది! పాక్‌ అతలాకుతలమవుతోంది! భారత్‌ దాడుల్లో ఇస్లామాబాద్‌ సర్వనాశనమైంది. పాక్ ప్రధాని ఇంటి ముందే బాంబు పేలింది. దెబ్బకు పాక్‌ ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌ అజ్ఞాతంలోకి వెళ్ళాడు!? పఠాన్‌కోట్‌ సెక్టార్‌లో పాక్ ఫైటర్‌ జెట్ల కూల్చివేయబడ్డాయి. భారత్‌ దాడిలో 8 క్షిపణులు, 16 డ్రోన్లు ధ్వంసమయ్యాయి. సైరన్‌ల మోతతో పాక్ పురవీధులు ఠారెత్తుతున్నాయి. పాక్ పైలట్ ఒకడు భారత సైన్యానికి చిక్కాడు. మన సైనిక స్థావరాలపై దాడికి ప్రయత్నించిన పాక్ విఫలమైంది. పాక్ అన్ని పన్నాగాలను భారత జవాన్లు తిప్పికొట్టారు. బార్డర్ లోని మన సరిహద్దు జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికీ దాయది కుటిల కుతంత్రాలకు పాల్పడే అవకాశం ఉన్నందున రెండు దేశాల మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొంది.

మరోవైపు పాక్ లో అంతర్యుద్ధం మొదలైంది. పాక్ వైఖరిపై విసుగు చెంది, స్వాతంత్ర్యం కోరుకుంటున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైనికులపై 6 చోట్ల దాడులు చేశామని వారే ప్రకటించుకున్నారు. పాక్‌ సైనికుల ఆయుధాలు, ఆహారం ట్రక్కులు పేల్చివేశారు. రిమోట్ బాంబులతో మొబైల్‌ టవర్లు ధ్వంసం చేశారు. బతికుంటే బలిసాకు అనుకుంటూ, పాక్ సైన్యం తమ ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకుని పారిపోతున్నారు. ఇదీ ప్రస్తుతం ఛిద్రమైన పాకిస్తాన్ ముఖచిత్రం.

న్యూ ఢిల్లీ, మే 8 (ఆర్‌.ఎన్‌.ఎ.):
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా రెండో రోజు పాక్‌ దాడులతో కౌంటర్‌ అటాక్‌ స్టార్ట్‌ చేసింది భారత్‌. పాకిస్తాన్‌లో లాహోర్‌, సియోల్‌కోట్‌తో పాటు ఇస్లామాబాద్‌, బహల్‌వాల్‌పూర్‌లోనూ దాడులు చేసింది. ఇప్పటికే చాలా నగరాలను టార్గెట్‌ చేసుకొని విధ్వంసం చేసింది. ఇప్పుడు లాహోర్‌లో డ్రోన్‌ దాడి చేసింది భారత్‌. గురువారం సాయంత్రం నుంచి సరిహద్దు వద్ద పాకిస్తాన్‌ చేస్తున్న దాడులకు అదే స్థాయిలో జవాబు ఇస్తోంది.

సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్‌ వరుస డ్రోన్‌ దాడుల తర్వాత భారత్‌ ఈ దాడి చేసింది. పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌ లో తమ ఎయిర్‌బోర్న్‌ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ విమానం కూలిపోయిందని పాకిస్తాన్‌ వైమానిక దళం ప్రకటించింది. కయ్యానికి కాలుదువ్విన పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు భారత్‌ సైనిక చర్యకు దిగింది. దీంతో పాకిస్తాన్‌ బెంబేలెత్తిపోతోంది. ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్‌ తుక్కుతుక్కు అయినట్టు సమాచారం. ఈ దాడులను తట్టుకోలేక భారత్‌ను ఎదుర్కోలేక పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షాబాజ్‌ షరీఫ్‌ దేశం విడిచి పోరిపోవడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ప్రత్యేక చార్టెడ్‌ ఫ్లైట్‌లో దేశం విడిచి వెళ్లిపోయేందుకు ఆయనకు సహాయక సిబ్బంది హెల్ప్‌ చేస్తున్నట్టు పాక్ నుంచి వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఆయన కనిపించకుండా పోయారు. బహుషా ఏ బంకర్ కలుగులోనూ ఈ ఎలుక దాగి ఉంటుందని భావిస్తున్నారు.

కొత్త ఘర్షణలు
గురువారం నాడు భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కొత్త ఘర్షణలు ప్రారంభమయ్యాయి. డ్రోన్‌ దాడులు, క్షిపణి దాడులు, సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్‌ అవుట్‌లు జరిగాయి. ఉగ్రదాడుల నేపథ్యంలో కరాచీ ఓడరేవు ప్రాంతం సమీపంలో పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. దీంతో భారత నావికాదళం అలర్ట్‌ అయింది. అరేబియా సముద్రంలో కీలకమైన అస్త్రాలను రెడీ చేసింది. అక్కడ కార్యాచరణను కొనసాగించడానికి పశ్చిమ నావికాదళం %Iచీూ% విక్రాంత్‌, డిస్ట్రాయర్లను మోహరించిందని తెలుస్తోంది. భారతదేశ క్షిపణి రక్షణ వ్యవస్థలు పాకిస్తాన్‌కు చెందిన ఒక %ఖీ%-16, రెండు %జీఖీ%-17 యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు.

భారత్ పై దాడులకు తెగబడ్డ పాక్
అంతకుముందు, పాకిస్తాన్‌ భారతదేశంలోని అనేక ప్రదేశాలపై దాడులు చేయడానికి ప్రయత్నించింది. వాటిని భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థలు విఫలం చేశాయి. గురువారం రాత్రి పాకిస్తాన్‌ డ్రోన్లు, క్షిపణులతో భారతదేశ పశ్చిమ సరిహద్దుల్లోని వివిధ ప్రదేశాలను అటాక్‌ చేయడానికి ప్రయత్నించింది. కానీ అది విజయవంతం కాలేదని భారత సైనిక అధికారులు తెలిపారు. జమ్మూ, పఠాన్‌కోట్‌, ఉధంపూర్‌లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్‌ ప్రయత్నించిందని అధికారులు తెలిపారు. పాకిస్తాన్‌ డ్రోన్‌లను భారత సాయుధ దళాలు సమర్థవంతంగా నేలమట్టం చేశాయని వివరించారు. బుధవారం రాత్రి కూడా అవంతిపుర, శ్రీనగర్‌, జమ్మూ, పఠాన్‌కోట్‌, అమృత్‌సర్‌, కపుర్తలా, జలంధర్‌, లూథియానా, అడంపూర్‌, భటిండా, చండీగఢ్‌, నల్‌, ఫలోడి, ఉత్తర్‌లై, భుజ్‌లను లక్ష్యంగా చేసుకుని పాక్‌ సైన్యం దాడికి పాల్పడిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే భారత్‌ పాక్‌ కుటిల యత్నాలకు చెక్‌ పెట్టింది.

పాక్ ను నిలువరించిన భారత సైన్యం
మంగళవారం రాత్రి భారత సాయుధ దళాలు ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పిఓకె), పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు చేసిన తర్వాత పాకిస్తాన్‌ కౌంటర్‌ అటాక్‌ ప్రయత్నాలు చేసింది. కానీ భారత్‌ దాయాది దేశాన్ని నిలువరించింది. ‘‘మే 7-8 రాత్రి, పాకిస్తాన్‌%ౌ% ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అవంతిపుర, శ్రీనగర్‌, జమ్మూ, పఠాన్‌కోట్‌, అమృత్‌సర్‌, కపుర్తలా, జలంధర్‌, లూథియానా, ఆదంపూర్‌, భటిండా, చండీగఢ్‌, నల్‌, ఫలోడి, ఉత్తరలై, భుజ్‌ ప్రాంతాల్లో సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోని డ్రోన్లు, క్షిపణులను ప్రయత్నించింది’’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘‘వీటిని ఇంటిగ్రేటెడ్‌ కౌంటర్‌ %ఖAూ% (మానవరహిత విమాన వ్యవస్థ) గ్రిడ్‌, వాయు రక్షణ వ్యవస్థలు నేలమట్టం చేశాయని’’ అని ఒక ప్రకటనలో వెల్లడించింది. పాక్‌ ఉగ్రవాదుల తరహాలో దాడులు చేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని విమానయాన శాఖ సూచించింది. విమానాశ్రయ టెర్మినల్‌ భవనాల్లో సందర్శకులను అనుమతించవద్దని నిర్దేశించింది.

భారత్ లో హై అలర్ట్
మరోవైపు సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూకశ్మీర్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనా సిద్ధంగా ఉండాలని సూచించింది. జమ్మూకశ్మీర్‌ లక్ష్యంగా పాక్‌ దాడులకు తెగబడింది. ముఖ్యంగా జమ్మూలోని విమాశ్రయమే లక్ష్యంగా డ్రోన్‌లను ప్రయోగించింది. భిష్ణా, ఆర్‌ఎస్‌ పురా, సాంబా, పూంచ్‌, కథువా ప్రాంతాల్లో షెల్లింగ్‌ దాడులు చేసింది. అయితే ఈ దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. పెరుగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా అఖ్నూర్‌, కిష్త్వార్‌, సాంబా, ఉధంపూర్‌లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు చేసింది. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో పాక్‌ డ్రోన్‌ దాడులు చేయగా, వాటని భారత సైన్యం కూల్చేసింది. మరోవైపు రాజస్థాన్‌లోని జైసల్మీర్‌, బికనేర్‌ సహా పలుప్రాంతాల్లో బ్లాక్‌అవుట్‌ ప్రకటించారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌, జలంధర్‌, పఠాన్‌కోట్‌ సహా పలు ప్రాంతాల్లో (బ్లాక్‌ అవుట్‌) విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. పాక్‌ దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అదనపు పారామిలటరీ బలగాలను పంజాబ్‌కు తరలిస్తున్నారు.

ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న ప్రధాని
పాకిస్థాన్‌ దాడులు చేపట్టిన నేపథ్యంలో, జరుగుతున్న పరిణామాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన మాట్లాడారు. మరోవైపు త్రివిధ దళాధిపతులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. మరోవైపు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా సీడీఎస్‌, త్రివిధ దళాధిపతులతో పరిస్థితులను సమీక్షించారు. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చినప్పటికీ, ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ, పర్యవేక్షిస్తూ తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏ సమస్య వచ్చినా, సమాచారాన్ని సైన్యానికి చేరవేయాలని ప్రధాని సూచించారు.

Latest News

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News