Wednesday, September 16, 2026
27.1 C
Hyderabad

KONDA|కొండా వర్సెస్ ఎర్రబెల్లి|ERRABELLI

ఒక్క దెబ్బకు మూడు పిట్టలు!
మలుపులు తిరుగుతున్న ‘కొండా’ దారులు!?
ట్విస్టుల మీద ట్విస్టులు

హైదరాబాద్, జులై 2 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
రాష్ట్ర అటవీ దేవాదాయశాఖల మంత్రి కొండా సురేఖ దంపతుల వ్యవహారం పార్టీ లోపలా, బయటా రోజుకో మలుపు తిరుగుతూ, ట్విస్టుల మీద ట్విస్టులు తీసుకుంటోంది. ఒకవైపు అంతర్గతంగా పార్టీలో కొందరిపై తిట్లతో మొదలైన పంచాయతీ, పరస్పర దూషణలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారి తీసింది. చివరకు షోకాజు నోటీసులు, వివరణలు, వివరణల పేరుతో ఆరోపణలు, డెడ్ లైన్ల దాకా వెళ్ళింది. ఇంకోవైపు ‘పరకాలలో పోటీ చేయడానికి నేనొస్తున్నానంటూ’ కొండా దంపతుల కూతురు సుస్మితా పటేల్ ఇన్ స్టాలో పెట్టిన పోస్టు సంచలనమైంది. మరోవైపు గత ఎన్నికలో తూర్పు నియోజకవర్గంలో రూ.70 కోట్లు ఖర్చు చేశామన్న మంత్రి కొండ సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి నోరు జారడం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదుకు దారి తీసింది. గత ఎన్నికలో కొండా సురేఖ ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు స్వయంగా బుధవారం ఎన్నికల కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇదే అదనుగా కొండా మురళి వరంగల్ మంత్రి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఎర్రబెల్లి కుటుంబంలో పుట్టిన వారెవ్వరైనా సరే, ఎర్రబల్లులే!’ అంటూ మరో కొత్త వివాదానికి తెరలేపారు. పార్టీలో అంతర్గత ప్రత్యర్థులను, బయటి పార్టీ ప్రత్యర్థులను పక్కన పెట్టి, తన పాత ప్రత్యర్థులను అనూహ్యంగా తెరమీదకు తెచ్చారు. బహుశా ఈ విధంగా పార్టీ లోపలి లొల్లిని మరిపించడానికే, కొత్త లొల్లిని కొండా మురళి తెరమీదకు తెచ్చారా? ఈ ఎత్తుగడ వేశారా? కాకపోతే తన పాత శత్రువులను కొత్తగా తెర మీదకు తెచ్చిన ఎత్తుగడ ఫలిస్తుందా? కచ్చితంగా కొంత టైమ్ పాస్ కి సహాయ కారిగా మాత్రం నిలుస్తుందడంలో సందేహం లేదు.

నిజానికి కొండ దంపతులు ఎర్రబెల్లికి మిత్రులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత చాలా కాలం క్రితమే ఎర్రబెల్లి కి ప్రత్యర్థులుగా మారారు. అలా ఒకరికొకరు ప్రత్యర్థుల పేరు మీదే పరస్పర విమర్శలు, ప్రతి విమర్శలతోనే ఎదిగారని కూడా రాజకీయాల్లో అంటుంటారు. వేర్వేరు పార్టీల్లో, వేర్వేరు దారుల్లో వేర్వేరుగా ఎదిగినప్పటికీ, వాళ్ళంతా ఒక్కటే అనే వారూ లేకపోలేదు. కావాలనే ఇదంతా అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడూ రాజకీయంగా తలపడని కారణంగా కూడా ఈ విమర్శలు వచ్చి ఉంటాయి. ఒకే పార్టీలో కొద్ది కాలం ఉన్నప్పుడు కూడా వాళ్లు స్నేహం చేసినట్లు కానీ, కయ్యానికి కాలు దువ్వినట్లు కానీ కనిపించలేదు. ఇదంతా అవసరమైన చర్చ కాకపోయినా, సందర్భోచితం మాత్రమే!

ఇక నోరు పారేసుకోవడం వల్ల స్వయంకృతాపరాధం వల్ల ప్రస్తుతం కొండ దంపతులు పార్టీలోపలా, బయట సమస్యల్లో చిక్కుకున్నారు. కొన్ని అనూహ్య సమస్యల్లో కూరుకుపోయారు. మంత్రి గా మాట్లాడకూడదని అంశాలు వెల్లడించి మంత్రి సురేఖ, పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాల డిమాండ్ చేస్తూ, తిట్టిపోసి మురళి ఇబ్బందుల్లో పడ్డారు. ఆ తర్వాత వాళ్ళు వెనక్కు రాలేక ఒక్కో మెట్టు దిగుతూ, మరింత గా పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ వచ్చారు. దీనికి దీటుగా పార్టీ నేతలు సైతం సమాధానమిస్తూ వస్తున్నారు. సమస్యలు అధిష్టానానికి ఫిర్యాదుల దాకా వెళ్ళాయి. వివరణల్లో ఫిర్యాదులు, పార్టీలో కొందరు పెద్దలను వివాదాల గోదా లోకి లాగడం వంటివి అనవసరంగా అనివార్యమయ్యాయి. వివరణల వరకు ‘ చేయి ‘ దాటింది. డెడ్ లైన్ల వరకు వెళ్ళింది. మరోవైపు ఎన్నికల ఖర్చు వ్యవహారం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులకు వెళ్ళింది. సరిగ్గా ఈ సమయంలోనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ పర్యటన కొంత కొండా దంపతులకు కలిసి వచ్చిందనే భావించాలి. ఈ వెసులుబాటును సరిగ్గా వినియోగించుకోవాల్సిన కొండా దంపతులు, మరో వైపు లాగారా?

ఒక్క దెబ్బకు మూడు పిట్టలు!
అన్న చందంగా, తన పాత ప్రత్యర్థిని, పార్టీలో అంతర్గతంగా తనకు ఇబ్బందులు తెస్తున్న మరో ప్రత్యర్థిని, తాజాగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన ఎన్నికల ప్రత్యర్థిని మొత్తం ముగ్గురిని కలిపి ఒకే గాటన కడుతూ కొండ మురళి ఎర్రబెల్లి కుటుంబంలో పుట్టిన వాళ్లంతా ఎర్రబల్లులే అని విమర్శలకు దిగారు. దీంతో సై ఒక వైపు నుంచి మరో వైపునకు మలుపు తిప్పినట్లు అయింది.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ, జిల్లా రాజకీయాల్లో అత్యంత విభాగంగాను చర్చనీయంగాను మారిన కొండా దంపతులు, మరెన్ని ట్విస్టులు ఇస్తారో చూడాలి. ఆయా సమస్యలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

వాళ్ళు ఎర్రబల్లులే

ఓరుగల్లు రాజకీయాల్లో ఎర్రబెల్లి కుటుంబంలో పుట్టినవారు ఎవరైనా సరే వాళ్ళు ఎర్రబల్లులేనని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు విమర్శించారు. వరంగల్ ఓసిటీ మంత్రి కొండా సురేఖ క్యాంపు కార్యాలయంలో మంగళవారం కొండా మురళీధర్రావు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సమావేశమయ్యారు. అనంతరం వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చిట్ల సత్యనారాయణ, ఇతర కార్పొరేటర్లతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ పర్యటనను విజయవంతం చేయాలని, ఎల్బీ స్టేడియంలో జరిగే సభకు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. భారాస నేత ఎర్రబెల్లి దయాకర్రావు, భాజపా నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణను ఉద్దేశించి కొండా మురళీ తీవ్ర విమర్శలు చేశారు. ఎర్రబెల్లి ఇంటి పేరు ఉన్నోళ్లు ఎర్ర బల్లులేనన్నారు. 2023 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి సురేఖమ్మను గెలిపించిన విషయంపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని చెప్పారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అన్ని కులాలకు భవనాలు కట్టిస్తామన్నారు. డివిజన్ల వారీగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అధికారులు, స్థానిక కార్పొరేటర్ల చేతుల మీదుగా తీసుకోవాలని సూచించారు.

https://youtu.be/UVR8t_PKe-0?feature=shared

కొండాపై ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు

మంత్రి కొండా సురేఖ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్‌ను సమర్పించారని ఆరోపిస్తూ, ఆమె శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ నేత, అప్పటి ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన ప్రదీప్ రావు, కొండా సురేఖ తన అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు సరైనవిగా ఇవ్వలేదని పేర్కొన్నారు.

సురేఖ భర్త కొండా మురళి ఇటీవల మీడియా ముందుకు వచ్చి ఎన్నికల ప్రచారానికి రూ.70 కోట్లు ఖర్చు చేశామని చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ మొత్తం ఖర్చు సురేఖ అఫిడవిట్‌లో ప్రస్తావించకపోవడం RP చట్టంలోని సెక్షన్ 10-A, 77, 78 ప్రకారం గంభీర ఉల్లంఘనగా పేర్కొన్నారు. అలాగే ఆమె అఫిడవిట్‌లో 2 ఎకరాల స్థిరాస్తిని మాత్రమే చూపించగా, మురళి 500 ఎకరాల భూమిని వారసత్వంగా పొందినట్లు స్వయంగా తెలిపారని పేర్కొన్నారు.

ఇవి తప్పుడు అఫిడవిట్ కింద RP చట్టంలోని 125-A సెక్షన్‌తో పాటు IPC సెక్షన్ 191, 193 ప్రకారం శిక్షార్హంగా పరిగణించాలన్నారు. పూర్తి విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రదీప్ రావు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ నేత నన్నపునేని నరేందర్ కూడా గతంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

https://youtu.be/v1CY3jTPBpc?feature=shared

Latest News

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News