తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు 10వ తేదీ నుంచి ప్రారంభమై, 19వ తేదీతో ముగియనున్నాయి. వైకుంఠ ఏకాదశి పండుగను పురస్కరించుకుని టీటీడీ భక్తులకు ఉత్తర ద్వారం గుండా దర్శనం కల్పించింది. ఈ సందర్బంగా లక్షల్లో భక్తులు స్వామి వారి దర్శనాన్ని పొందారు. 19వ తేదీతో SSI టోకెన్ల జారీ కూడా ముగియనుంది. 20వ తేదీన శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులకు టికెట్లు ఇవ్వకుండా, వారిని నేరుగా క్యూలైన్‌లో దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని టీటీడీ నిర్ణయించింది. అలాగే, 20న వీఐపీ బ్రేక్ దర్శనం కూడా రద్దు చేశారు. 21వ తేదీ నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు రోజుకు రోజుకు జారీ చేస్తారని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు.

