Sunday, June 14, 2026
28.9 C
Hyderabad

అప్పుల ఊబీ నుంచి గట్టెక్కడం ఎలా!?|EDITORIAL

2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరగి, ఏపీ- తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావం తర్వాత రెండు రాష్ట్రాలు కూడా భారీ అప్పుల్లో కూరుకుపోయాయి. 2014-15లో ఉమ్మడి ఏపీ రాష్ట్ర లోటు రూ.16వేల కోట్లుగా కాగ్‌ తేల్చింది. ఒకవైపు ఆదాయ మార్గాలు పెరుగుతున్నా, అంతకంతకూ పెరుగుతున్న ఉద్యోగులు, పాలకుల జీత భత్యాలు, సంక్షేమ పథకాలు రాష్ట్రాలకు పెను భారంగా మారుతున్నాయి. విధానాల లోపాలు, ఆదాయ సముపార్జనలో వ్యూహాత్మక తప్పిదాలు, అనుత్పాదక రంగాల్లో పెట్టుబడులు, అమలుకు అలవికాని ఉచిత సంక్షేమ పథకాలు, అన్నీ కలిసి తడిసి మోపెడవుతున్నాయి. చేసిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేని, ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితి దాపురించడానికి కారణం పాలకుల, అధికారుల అసమర్థతే. ఈ పరిస్థితిలో రాష్ట్రాలు అప్పుల ఊబీ నుంచి గట్టెక్కడం ఎలా? వ్యూహాత్మక పరిష్కారాలు ఏంటి?

ప్రస్తుతం ప్రభుత్వమే బడ్జెట్ లో చెప్పిన విధంగా తెలంగాణ అప్పు భారం రూ.6.85 లక్షల కోట్లు. ఇది రాష్ట్ర జీడీపీకి 26.2%. సమానం. అప్పుల్లో ఎక్కువగా మంచినీరు, సాగునీరు వంటి మౌలిక సదుపాయాలు, వడ్డీ భారాలు, జీత భత్యాలు, పెన్షన్లు, రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల ఖర్చులే ఎక్కువ. బడ్జెట్ లో సగం జీత భత్యాలకుపోను, రూ.56వేల కోట్లు సంక్షేమ పథకాలకే ఖర్చవుతున్నాయి. 2024 25 లో తెలంగాణ ఆదాయాల్లో 78% స్వంత వనరుల నుంచి వస్తోంది, మిగతా 22% కేంద్రం నుండి వస్తోంది. అందులో రాష్ట్రానికికు పన్నుల వాటాగా 12%, గ్రాంట్ల రూపంలో 10% నిధులు వస్తున్నాయి.
ఏపీ లో అప్పులు రూ.4.86 లక్షల కోట్లు. ఇది రాష్ట్ర జీడీపీకి 34.7% కు సమానం. ఇందులో ఉచిత, సంక్షేమ పథకాలకు 55వేల కోట్లు ఖర్చవుతున్నాయి. దీనికి గత ప్రభుత్వాల అధిక ఖర్చులు, ప్రాజెక్టుల మేనేజ్‌మెంట్ లోపాలు, ఆదాయ వృద్ధి తక్కువ ఉండటం, కేంద్ర సాయం గ్రాంట్లు తక్కువగా అందడం కారణాలు. 2023 24 లో ఆంధ్రప్రదేశ్ కు మొత్తం ఆదాయాల్లో 57% స్వంత వనరుల నుంచి, మిగతా 43% కేంద్రం నుండి వస్తోంది. అందులో రాష్ట్రానికి పన్నుల వాటాగా 20%, గ్రాంట్ల రూపంలో 23% నిధులు వస్తున్నాయి.

తాజాగా తెలంగాణ 16వ ఫైనాన్స్ కమిషన్ ముందు అప్పులను పునర్వ్యవస్థీకరించాలని, వడ్డీ తగ్గింపు, చెల్లింపు ప్రీమియం తగ్గించాలని కేంద్రాన్ని కోరింది. కొన్ని అప్పులను కమర్షియల్ కాని బ్యాంకులకు బదలాయించాలని కూడా కోరింది.

అలాగే, ప్రస్తుత రాష్ట్రాల ఆదాయంలో కేంద్రం వాటా 41% ఉన్నా, తెలంగాణ ఆ పన్నుల వాటాను 50%కి పెంచాలని కోరుతోంది. ఇందువల్ల రాష్ట్రాలకు స్వతంత్ర వ్యయం నిలుపుకోవడానికి అవకాశాలు మెరుగవుతాయి. కేంద్ర పథకాలను రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా అమలు చేసే స్వేచ్ఛని కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, సహాయ నిధులు అనుకున్న స్థాయిలో రాష్ట్రాలకు చేరడం లేదు.
అయితే, ఇవన్నీ కలిసి రాష్ట్రాలకు పెను సవాళ్ళను విసురుతున్నాయి. అప్పుల పెరుగుదల సంక్షేమ పథకాలపై అధిక ప్రభావం చూపుతున్నాయి. ప్రాజెక్టుల్లో ఖర్చు పెరిగిపోవటం, వాటిని బడ్జెట్ లో స్పష్టంగా తెలపడకపోవటం. ఆదాయ వృద్ధి తక్కువగా ఉండటం, ఉత్పాదకత, పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి ఆలస్యం కావటం. పన్నుల వసూలు, ప్రభుత్వ ఆస్తులను వదిలేయడం, ఆర్థిక నిర్వహణలో పారదర్శకత లోపాలు ఉండటం వంటి సమస్యలు అనేకం ఉత్పన్నం అవుతున్నాయి.

మరి వీటి పరిష్కార మార్గాలు ఏమిటి? అంటే రాష్ట్రాలు తమ ఖర్చులను నియంత్రించుకోవాలి. దినసరి వేతనాలు, సామాజిక రంగ పంపిణీ పథకాలను సమీక్షించాలి. కొన్ని ఉచిత పథకాలు ప్రభుత్వానికి పెను భారాన్ని కలిగిస్తున్నాయి. ఆదాయ వృద్ధికి అవసరమైన పెట్టుబడులు పెంచుకోవాలి. పన్నుల వసూలును సరళం చేయాలి. ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మడం కాకుండా, వాటిని, ఇతర వనరులను సమర్ధవంతంగా వినియోగించాలి. ఆయా పథకాలను పున: పరిశీలించాలి. ప్రతి పథకం లాభ నష్టాలను బేరీజు వేయాలి. నష్టం చేసే పథకాలకు తిలోదకాలివ్వాలి. ప్రభుత్వ పథకాలు, ఆదాయ వ్యయాల్లో పారదర్శకతను పాటించాలి. ప్రతి పథకానికి ఆడిట్ ఉండాలి. కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సహాయం సహా, ఆర్థిక సంక్షేమ నివేదికలు రూపొందిస్తూ దశల వారీగా అప్పులను తగ్గించుకునే ప్రణాళికలు రూపొందించుకోవాలి. కేంద్ర గ్రాంట్లు, ప్యాకేజీలు రాష్ట్రాల సమస్యలకు పరిష్కారం చూపేవిగా ఉండాలి. ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తే, కేంద్ర సహాయం, ప్యాకేజీలు పెరిగి, పన్నులు తగ్గి పురోగతికి ఆస్కారం ఏర్పడుతుంది.

అప్పులు అధికమైతే, అది రాష్ట్రాల ఆర్థిక స్వతంత్రతను దెబ్బతీస్తాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రజలకు పార్టీలిచ్చే వాగ్దానాలు ప్రశ్నార్థకమవుతాయి. కేంద్రం ఇచ్చే సహాయం తాత్కాలికమే. దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాలు స్వీయ సామర్థ్యాన్ని పెంచుకోవాలి.

Latest News

అత్యధిక బ్లడ్ డోనర్ మోటివేటర్ డా. రాజేశ్వర్ రావు|INTERNATIONAL|BLOOD|DONORS

రక్తదాన సేవలకు గుర్తింపుగా గవర్నర్ సత్కారం|BLOOD DONATION|GOVERNOR హైదరాబాద్, జూన్ 14 (అడుగు న్యూస్): రక్తదానం పట్ల సమాజంలో విస్తృత ప్రచారం, చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్త దానాన్ని విశేషంగా ప్రోత్సహిస్తూ, విశిష్ట సేవలందిస్తున్న ...

బరంతి ఇకమతు భలేగుందే!|ADUGU TRENDS

ఇల్లు కట్టుడంటే అట్లిట్ల కాదు. నెలలు, సంవత్సరాలు పడతయి. ఒక్కో కట్టడం దగ్గర ఒక్కో జాగర్త తీసుకోవాలె. లేకపోతే ఇల్లు గుల్లైతది. గట్ల ఇంటికి బరంతి నింపుతం కద. గదాంట్ల మనమైతే ఏం...

భూమి పునరుద్ధరణకే ఎల్ నినో హెచ్చరిక!|EDITORIAL

ఎల్‌నినోను కేవలం ప్రకృతి వైపరీత్యంగా మాత్రమే చూడడం సరైంది కాదు. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలనం, భూమి క్షీణత, ప్లాస్టిక్ కాలుష్యం, జలవనరుల నాశనం వంటి మానవ చర్యలు కూడా ఈ సంక్షోభాలను...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 14 నుండి జూన్ 21 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. పనుల విషయంలో ముందడుగు వేయడానికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం...

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News