- దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఈనెల 31
- మొత్తం బ్యాక్ లాగ్ సీట్లు 6832
- ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 20న
- మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు
- ఎంజేపి కార్యదర్శి బడుగు సైదులు, ఐఎఫ్ఎస్
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ గురుకుల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి
ఖాళీగా ఉన్న 6, 7, 8, 9వ తరగతుల సీట్లను భర్తీ చేయడానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఈ నెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు, ఐఎఫ్ఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్ లైన్ లో www.mjptbcwreis.telangana.gov.in లేదా https://mjptbcadmissions.org వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. 6, 7, 8, 9వ తరగతుల (ఇంగ్లీష్ మీడియం)లో మొత్తం 6,832 బ్యాగ్ లాగ్ సీట్లు ఉన్నాయని, అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 20-04-2025 (ఆదివారం)న ఉదయం 10.00 గంటల నుంచి నుండి మధ్యాహ్నం 12. 00 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుందని,
ప్రవేశ పరీక్షకు అర్హతగల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం, అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కార్యదర్శి సూచించారు.

