Saturday, July 25, 2026
22.7 C
Hyderabad

తమిళనాడు హంగ్-గవర్నర్-టీవీకే కింకర్తవ్యం?|EDITORIAL

హంగ్ సమయంలో ఎవరిని ముందుగా పిలవాలి? అతిపెద్ద పార్టీనా? లేక మెజారిటీ మద్దతు ఉన్న కూటమినా? అన్న విషయంలో రాజ్యాంగం స్పష్టమైన విధానం నిర్దేశించలేదు. ఇక్కడే గవర్నర్ విచక్షణాధికారం ప్రాధాన్యం సంతరించుకుంది. మన వ్యవస్థలో ఇలాంటి టైంలో ఏ గవర్నర్? ఏ నిర్ణయం? తీసుకున్నా వివాదానికే అవకాశాలె క్కువ. తమిళనాడులో ప్రధాన సమస్య గవర్నర్ కాదు. స్పష్టమైన జాతీయ విధానం లేకపోవడమే. ఒక రాష్ట్రంలో అతిపెద్ద పార్టీకి అవకాశం ఇస్తే, మరో రాష్ట్రంలో కూటమికి అవకాశం ఇస్తున్నారు. దీంతో గవర్నర్ విచక్షణాధికారం రాజకీయ రంగు పులుముకుంటోంది.!*

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోసారి భారత రాజ్యాంగ వ్యవస్థలో గవర్నర్ పాత్రపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. 234 సభ్యుల అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే తాజా ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, స్పష్టమైన మెజారిటీకి ఇంకా 10 సీట్లు తక్కువయ్యాయి. డీఎంకే కూటమి 73 స్థానాలు, అన్నాడీఎంకే కూటమి 53 స్థానాలు గెలుచుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందు మెజారిటీ మద్దతు లేఖలు సమర్పించాలని గవర్నర్ విశ్వనాథ్ కర్లేకర్ కోరడం రాజకీయ వివాదానికి దారితీసింది.

“అతిపెద్ద పార్టీగా అవతనించిన టీవీకేకే ముందుగా అవకాశం ఇవ్వాలి” కొందరంటుంటే, “మ్యాజిక్ ఫిగర్ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు ఆహ్వానించడం రాజ్యాంగ విరుద్ధం” అని మరికొందరంటున్నారు. అయితే రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులు, కమిషన్ సిఫారసులు ఏమి చెబుతున్నాయి? గవర్నర్ నిర్ణయం సరైనదేనా? ఇప్పుడు టీవీకే ఏం చేయాలి?

రాజ్యాంగం ఏం చెబుతోంది?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. కానీ ఎవరిని ముందుగా పిలవాలి? అతిపెద్ద పార్టీనా? లేక మెజారిటీ మద్దతు ఉన్న కూటమినా? అన్న విషయంలో రాజ్యాంగం స్పష్టమైన విధానం నిర్దేశించలేదు. ఇక్కడే గవర్నర్ విచక్షణాధికారం ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే, సర్కారియా కమిషన్, తరువాత పుంచ్ఛీ కమిషన్‌లు హంగ్ అసెంబ్లీ సందర్భాల్లో కొన్ని మార్గదర్శకాలు సూచించాయి. వాటి ప్రకారం:
1. ముందస్తు కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంటే వారికి మొదటి అవకాశం ఇవ్వాలి.
2. అతిపెద్ద పార్టీ ఇతర పార్టీల మద్దతుతో మెజారిటీ చూపగలిగితే ఆహ్వానించాలి.
3. ఎన్నికల అనంతరం ఏర్పడిన కూటమిని పరిగణించాలి.
4. చివరికి అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ ద్వారా మెజారిటీ నిరూపించుకోవాలి.
అంటే “అతిపెద్ద పార్టీ” అన్న కారణం ఒక్కటే ప్రభుత్వం ఏర్పాటు హక్కు ఇవ్వదు. అదే సమయంలో అతిపెద్ద పార్టీని పూర్తిగా పక్కన పెట్టాలని కూడా ఎక్కడా చెప్పలేదు. అందుకే ప్రతి హంగ్ అసెంబ్లీలో గవర్నర్ నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది.

గవర్నర్ నిర్ణయం సరైనదేనా?
ప్రస్తుత పరిస్థితిలో గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా తప్పు అనడం కష్టం. టీవీకేకు 108 సీట్లు ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇంకా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఆ మద్దతు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు మద్దతు ఇస్తున్నారు? అనే విషయంపై స్పష్టత లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తే తరువాత గవర్నర్ తీరుపై ఆరోపణలు రావచ్చు.
గతంలో కర్నాటక, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో ఇదే జరిగింది. అతిపెద్ద పార్టీకి అవకాశం ఇచ్చి రోజులు గడిపిన తర్వాత ఎమ్మెల్యేల కొనుగోళ్లు, రాజకీయ ఒత్తిళ్లు, ఫిరాయింపులు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. అందుకే ఇప్పుడు గవర్నర్లు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
అయితే, తమిళనాడు గవర్నర్ విజయ్‌ను తిరస్కరించలేదు. కేవలం “మెజారిటీ మద్దతు నిరూపించండి” అని మాత్రమే చెప్పారు. ఇది రాజ్యాంగబద్ధమైన అభ్యర్థనే. ఎందుకంటే, అంతిమంగా స్థిరత్వమైన ప్రభుత్వం ముఖ్యం. ఒకవేళ మెజారిటీ లేని ప్రభుత్వం ఏర్పడి వెంటనే కూలిపోతే రాష్ట్ర పరిపాలన అస్థిరంగా మారుతుంది.

టీవీకే ఇప్పుడు ఏం చేయాలి?
ప్రస్తుతం టీవీకే ముందున్న మార్గాలు స్పష్టంగా ఇలా తోస్తున్నాయి.
మొదటిది: డీఎంకే లేదా అన్నాడీఎంకే మద్దతు పొందడం.
కాంగ్రెస్ ఇప్పటికే 5 సీట్లతో మద్దతు ప్రకటించినప్పటికీ, అధికారిక లేఖలు సమర్పించలేదు. కాబట్టి విజయ్ రాజకీయ చర్చలను సాధ్యమైనంత వేగంగా ముగించాలి.
రెండోది: ఫ్లోర్ టెస్ట్ కు సిద్ధమవడం.
గవర్నర్ అవకాశం ఇస్తే అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలి. అయితే దానికి ముందే అవసరమైన మద్దతు సమీకరించడం కూడా అత్యవసరం.
మూడోది: తిరిగి ఎన్నికల పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంది. ఏ పార్టీ లేదా కూటమి మెజారిటీ నిరూపించలేకపోతే రాష్ట్రపతి పాలన లేదా మరోసారి ఎన్నికలు తప్పకపోవచ్చు.

విమర్శలు సమంజసమేనా?
గవర్నర్‌ను విమర్శించడం సహజం. కానీ ప్రతి నిర్ణయాన్ని రాజకీయ కోణంలో మాత్రమే చూడటం సరైంది కాదు. గవర్నర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కొందరు విమర్శిస్తుండగా, మరికొందరు ఆయన రాజ్యాంగ పరిరక్షణ కోసమే జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు. నిజం చెప్పాలంటే మన వ్యవస్థలో హంగ్ సమయంలో ఏ గవర్నర్? ఏ నిర్ణయం? తీసుకున్నా వివాదానికి దారితీసే అవకాశాలే ఎక్కువ.

తమిళనాడులో ప్రధాన సమస్య గవర్నర్ కాదు. స్పష్టమైన జాతీయ విధానం లేకపోవడమే. ఒక రాష్ట్రంలో అతిపెద్ద పార్టీకి అవకాశం ఇస్తే, మరో రాష్ట్రంలో కూటమికి అవకాశం ఇస్తున్నారు. దీంతో గవర్నర్ విచక్షణాధికారం రాజకీయ రంగు పులుముకుంటోంది.

పరిష్కారమేంటి?
ఇలాంటి వివాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన చట్టపరమైన మార్గదర్శకాలు తీసుకురావాలి. హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు:
1.ముందుగా ఎవరిని పిలవాలి?
2. మద్దతు లేఖలు తప్పనిసరా?
3. ఫ్లోర్ టెస్ట్ ఎన్ని రోజుల్లో జరగాలి?
4. అతిపెద్ద పార్టీకి ఎంత గడువు ఇవ్వాలి?
వంటి అంశాలపై రాజ్యాంగ సవరణ లేదా పార్లమెంటు చట్టం అవసరం. తమిళనాడు పరిణామాలు మరోసారి ఒక నిజాన్ని గుర్తు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు గెలవడం ఒక్కటే సరిపోదు. స్థిరమైన మెజారిటీని సమీకరించగల రాజకీయ సామర్థ్యమే ప్రభుత్వ ఏర్పాటుకు అసలు అర్హత. అంతేకాదు, ఈ హంగ్ పరిస్థితులు, సాగదీతలు కూడా పార్టీ ఫిరాయింపులను మరింతగా ప్రోత్సహించే ప్రమాదంగా పరిణమిస్తున్నాయి.

Latest News

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

యియర్ పోన్లతోటి శెవులకు శిల్లే!?|ADUGU TRENDS

కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సాలు..ఇగ దానెంటే పడ్తం. గదాన్నే అనుసరిత్తం. ఏమైతాందో సూసుకోం. గసొంటిదే గీ యియర్ పోన్ల వాడకం. గదేందో సూద్దా పదండ్రి. అదే పనిగా యియర్ పోన్లను వాడేటోల్లకు గా కర్ణభేరి...

నీట్ లీకేజీ.. అంత లోకువా!?|EDITORIAL

పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే విద్యా వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందువల్ల నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితం చేయకుండా, పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి...

జూలై 23, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి నవమి ఉదయం 08.27 వరకు ఉపరి దశమి నక్షత్రం విశాఖ రాత్రి తెల్ల 03.30 వరకు ఉపరి అనురాధ యోగం శుభ రాత్రి 10.06 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 08.28...

అడుగు ఎక్స్ క్లూజివ్: సీజేపీ ఆందోళన వెనక కుట్ర కోణం?|CJP|NATIONAL|ADUGU EXCLUSIVE

ప్రాణాలకు తెగించి రావాలని సందేశాలు ప్రాణత్యాగాలు చేసిన వారిని గుర్తుంచుకుంటాం సీక్రెట్ యాప్‌తో పరస్పరం సందేశాలు చేరవేత సంసద్ యాత్రపై కూపీ లాగుతున్న పోలీసులు|SAMSAD న్యూఢిల్లీ, జూలై 21 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం చేపట్టిన...

గాడ వజ్రాల వాన!?|ADUGU TRENDS

మన కాడ.. ఏ తియ్ మనకాడేంది? ఏడైనా.. శినుకంటే నీటి సుక్కే. జల్లంటే నీల్లే. అని అనుకుంటం కానీ, గాడ మాత్రం శినుకంటే వజ్రం. వానంటే వజ్రాలే!? కానీ, గా వజ్రాలను మనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News