జనగామ జిల్లా, పాలకుర్తి మండల కేంద్రంలో బస్టాండ్ పునరుద్ధరణకు సీఐ మహేందర్ రెడ్డి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. అందులో భాగంగా ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్ కంట్రోలర్‌కు మైక్ సెట్‌ను సీఐ ఆదేశాల మేరకు ఎస్ఐ లింగారెడ్డి అందజేశారు. ఈ మైక్ సెట్ ద్వారా బస్సుల సమాచారం అందించడానికి ఉపయోగపడుతుందని, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేసి సీఐ కు ధన్యవాదాలు తెలిపారు.
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో పాల్గొన్న సీఐ
పాలకుర్తి మండల కేంద్రంలో కార్మిల్ కాన్వెంట్ హైస్కూల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, సీఐ మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రోడ్డు క్రాస్ చేసే సమయంలో విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు, ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వాడకంపై వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లింగారెడ్డి, పోలీసులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
క్రీడా పోటీలను ప్రారంభించిన సీఐ
పాలకుర్తి మండల కేంద్రంలో హైస్కూల్లో భారత గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను సిఐ మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుధా హైస్కూల్ ప్రిన్సిపల్ రాపాక విజయ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

