Wednesday, September 16, 2026
27.2 C
Hyderabad

Bjp|బీజేపీ New Presidents|కొత్త అధ్యక్షుల బాధ్యతలు స్వీకరణ

Party|పార్టీ Future|భవిష్యత్తు లక్ష్యాలకు మార్గ నిర్దేశం

నూతన అధ్యక్షులు Ramchandra rao| రాంచంద్రరావు, madhav| మాధవ్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీకి కొత్త అధ్యక్షుల నియామకం అనంతరం పార్టీ నేతల ప్రసంగాలు మార్గ నిర్దేశకంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్. రాంచంద్రరావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పీవీఎన్ మాధవ్ చేసిన కీలక వ్యాఖ్యలు, బీజేపీ కార్యకర్తలను ఉత్సాహపరిచేలా… ఉన్నాయి.

తెలంగాణలో జరిగిన రాష్ట్ర అధ్యక్ష ప్రమాణ స్వీకార సభలో బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, కొత్త అధ్యక్షుడు రాంచంద్రరావు పార్టీకి కట్టుబాటుతో సేవలందించిన నాయకుడిగా కొనియాడారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ట్రోలింగ్‌కి రామచంద్రరావు ఘనత భరించగలిగే నాయకుడని, గతంలో మోదీగారిపై కూడా ట్రోలింగ్ జరిగిందని గుర్తు చేశారు. ఏబీవీపీ రోజుల్లో రాడికల్స్ దాడుల వల్ల కాళ్లు వంకరైన రామచంద్రరావు చరిత్ర ఆయన త్యాగాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. రామచంద్రరావు నాయకత్వంలో కాషాయ పతాకాన్ని గోల్కొండపై ఎగరేయాలన్నది తమ లక్ష్యమన్నారు.

రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం రామచంద్రరావు మాట్లాడుతూ, తాను పేరుకే అధ్యక్షుడు అయినా, హృదయపూర్వకంగా పార్టీకి కార్యకర్తేనని, కార్యకర్తలే బీజేపీకి అసలైన నేతలని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వెయ్యి ఓట్లు వచ్చిన రోజుల్లో కూడా కార్యకర్తలు పోరాడారని, ఇప్పుడు పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారన్నది మన పార్టీ విజయానికి నిదర్శనమన్నారు. పార్టీని అగ్రనాయకులు, కార్యకర్తలు, అందరితో చర్చించి ముందుకు తీసుకెళ్లేందుకు పనిచేస్తానని, బీజేపీ ప్రభుత్వాల వల్ల దేశంలో ఎన్నో మార్పులు జరిగాయని అన్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, గత ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా 34 లక్షల సభ్యుల నమోదు జరిగిందని, 937 మండలాల్లో 911 మండలాలకు అధ్యక్షులను ఎన్నిక చేశామని వివరించారు. రాష్ట్రంలో 20 వేల బూత్ కమిటీలతో పాటు 5610 శక్తి కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. బీజేపీనే దేశంలో ప్రజాస్వామ్యాన్ని పాటించే పార్టీగా అభివర్ణించారు. కేసీఆర్ కుటుంబం, రాహుల్ గాంధీ కుటుంబం ప్రజల ఆస్తిని దోచుకున్నాయని విమర్శించారు.

ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడిగా బాధ్యతలు పూర్తిచేసుకున్న బండి సంజయ్, కిషన్ రెడ్డిలు గతంలో పని చేసిన నేతల కృషిని గుర్తు చేస్తూ, రాంచంద్రరావుతో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ త్యాగాలతో నిలిచిన పార్టీగా గుర్తింపు పొందిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే బీజేపీని అధికారంలోకి తీసుకురావాల్సిందేనని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మాధవ్ మాట్లాడుతూ, తనకు కుటుంబం, పార్టీ రెండూ ఒక్కటేనని, బీజేపీని తిరుగులేని శక్తిగా మార్చడమే తన లక్ష్యమన్నారు. ఏపీలో అధికారంలోకి రాగల శక్తి బీజేపీకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జెండా, కూటమి అజెండాతో ముందుకు వెళ్తామని, పార్టీకి బలోపేతం చేసి రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానాన్ని దక్కించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ నూతన నాయకత్వం బీజేపీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మున్ముందు మరింత బలాన్ని అందించనుంది. కార్యకర్తల ఐక్యత, నేతల కృషి, మోదీ నాయకత్వంలో అభివృద్ధి ఆశయాల నెరవేర్చే పోరాటమే బీజేపీ విజయ మార్గమని వారు స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ మరింత బలంగా ఎదగడానికి ఈ కొత్త నేతల నాయకత్వం కీలకం కానుంది.

Latest News

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News