జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపిన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గొల్లపల్లి మండలం చిల్వా కోడూరు వద్ద కారు, బైక్ ఢీకొన్న ఘటనలో మహిళ ఎస్సై సహా యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎస్సై శ్వేత కారు ద్వారా ధర్మారం నుంచి జగిత్యాల వెళ్తుండగా, అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు కూడా అక్కడికక్కడే మృతి చెందాడు.

