Friday, September 18, 2026
26.4 C
Hyderabad

మానవత్వమా! నీ అడ్రసెక్కడ?|EDITORIAL

మానవత్వం మంటగలుస్తోంది. మానవ విలువలు మట్టిపాలవుతున్నాయి. మనిషి ప్రాణం త్రుణ ప్రాయంగా మారింది. నిత్యం ఏదో ఘోరం వినాల్సి రావడమో, చూడాల్సి రావడమో తప్పడం లేదు. అసాంఘిక, అత్యాచార, హత్యలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. నేరం-ఘోరం నిత్యకృత్యమైంది. విక్రుత విష రూపాలు తీసుకుంది. బయటకు వెళ్ళినవాళ్లు తిరిగి వస్తారా? అన్న భయం పోయింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నా సరే, ఏమైనా జరగొచ్చు. ఎవరికి ఏమైనా కావచ్చు. ఏడడుగులు కలిసి నడిచిన భార్యాభర్తలు, అన్నా దమ్ములు, తల్లిదండ్రులు పిల్లలు అన్న రక్త సంబంధాలు కూడా రక్తమోడుతున్నాయి. కుటుంబ బంధాలు ఏనాడో మంటకలిశాయి. సమాజంలో మనుషుల సంబంధాలన్నీ అవసరాల మేరకో, ఆర్థికపరంగానో ముడి పడ్డాయి. దీంతో ఎవరన్నా, ఎవరికీ లెక్కలేదు. ఎవరిని ఎవరు ఏం చేస్తారో తెలియదు. ఒక కుటుంబ సభ్యులు ఒక ఇంట్లో కలిసి ఉన్నా, మానసికంగా దూరమే. మరి సమాజంలో ఏం జరుగుతోంది? ఎందుకీ మారణ హోమం. అమానవీయతత్వం? బహుషా ఈ కలికాలం అంతరించిపోతుందంటే ఇదేనేమో? ఇలాగేనేమో?

ఒకప్పుడు ఎవరికి ఎవరి వల్లనైనా హాని ఉందంటే అది శ్రతువు వల్ల, ప్రక్రుతి ప్రకోపం వల్ల, ప్రమాదాల వల్ల అయి ఉండేది. ఇప్పుడా భయం అక్కరలేదు. మన పక్కనే మనతో నవ్వుతూ మాట్లాడే వారితోనో, మన కన్న కొడుకులు, బిడ్డలతోనో, భార్యా భర్తతోనో, అన్నాతమ్ముళ్ళతోనో, మన కుటుంబ సభ్యులు, మన బంధువులు, మన రక్త సంబంధీకులు, అంతా మన అనుకున్న వాళ్ళతోనే ప్రమాదాలు పొంచి ఉన్నాయి.

జాతీయ నేర నివారణ విభాగం గణాంకాల ప్రకారం.. దేశంలో రోజుకు 86 అత్యాచారాలు నమోదవుతున్నాయి. ఇందులో 90 శాతం దారుణాలు తెలిసిన వ్యక్తుల ద్వారానే జరుగు తుండడం గమనార్హం. బాధితుల్లో 10 శాతం మంది 18ఏళ్ల లోపు వారు కాగా, 66శాతం మంది 18-30 ఏళ్ల లోపువారు. దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న అత్యాచార, హత్యాచార ఘటనలు, విద్యార్థినులపై జరుగుతున్న దారుణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సామాజికంగా, శాంతిభద్రతల, ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతో ఎదిగామని అనుకుంటున్న ఈ తరుణంలోనూ మన మానసిక దౌర్బల్యాన్ని, మన వెనుక బాటుతనాన్ని, మన సంకుచిత మనస్తత్వాన్ని, పెరుగుతున్న పగ, ప్రతీకారాలు, నేర ప్రవ్రుత్తిని, సమాజంలో పెరుగుతున్న అశాంతి ధోరణులను, మన భద్రతను, మన రక్షణను, మన పాలకుల నిర్లక్ష్య, నిర్లిప్త ధోరణులను ఎత్తి చూపుతున్నాయి. మన మానసిక ఈ స్థితులే మనల్ని వెక్కిరిస్తున్నాయి.

భర్తలను వదిలించుకునే భార్యల సంఖ్య పెరుగుతోంది. ప్రియుడి మోజుల చంపేవారు కొందరు….ప్రియురాలి కోసం భార్యలను వధించే వారు మరికొందరు… సుపారీ హత్యలు, పరువు హత్యలు. ఆస్తుల పంచాయితీల్లో అన్నాతమ్ములమనే భావన పోతోంది. అన్నను తమ్ముడు చంపడమో..తమ్ముడిని అన్నను చంపడమో మామూలైంది. మద్యానికి బానిసలై తల్లిదండ్రులను కడతేరుస్తున్నారు. పోలీసులు అన్నా.. జైలు అన్నా భయం లేకుండా పోతోంది. జైలుకే కదా? కొన్ని రోజులు వెళ్లి వద్దాంలే! అన్న ధోరణి కనిపిస్తోంది. ఎక్కడైనా సరే, డబ్బులు పెడితే చాలు బయట పడొచ్చన్న నిర్లక్ష్యం కూడా వేళ్ళూనుకోవడమే కాదు, వట వ్రుక్షమైపోతోంది. అత్యాచార ఘటనలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇటీవల హైదరాబాద్‌లో ఓ కూతరు ప్రియుడితో కలసి తల్లిని హత్య చేయించింది. వరంగల్‌లో ప్రియురాలు మోజులో పడి భార్యను నిర్లక్ష్యం చేయడంతో ఇటీవల ఓ డెంటిస్ట్‌ ఆత్మహత్య చేసుకుంది. సమాజంలో పడిపోతున్న విలువలు, పెరుగుతున్న విష సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కోల్‌కతాలో వరుస హత్యాచార ఘటనలు..ఆందోళన కలిగించాయి. కోల్‌కత్తా లా కాలేజీ విద్యార్థినిపై సహ విద్యార్థుల అత్యాచారం, ఐఐఎం విద్యార్థినిపై కళాశాల హాస్టల్లోనే అఘాయిత్యం జరిగాయి. బెంగాల్‌లో అధికార పార్టీకి చెందిన విద్యార్థి సంఘం నాయకులు ఈ దుర్మార్గం వెనుక ఉన్నారని వార్తలు వచ్చాయి. గతేడాది ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ హాస్పటల్లో జూనియర్‌ డాక్టర్‌ అత్యాచారానికి, హత్యకు గురి కావడం దేశవ్యాప్త ఆందోళనలకు దారి తీసింది.

ఒడిషాలో బిఇడి విద్యార్థిని … తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధ్యాపకుడి విూద ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోకపోవడం దారుణం. భవిష్యత్తు లో ఉపాధ్యాయినిగా ఎదగాల్సిన విద్యార్థిని బలన్మరణానికి దారి తీసింది. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన ఇంటర్‌ విద్యార్థిని కళాశాలకు వెళ్లి, గండికోటలో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో పారా మెడికల్‌ విద్యార్థినులు… తమను ల్యాబ్‌ అసిస్టెంటు, మరో ముగ్గురు సిబ్బంది లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్టు- ఫిర్యాదు చేశారు. ఏలూరులోని స్టోర్ట్స్‌ అధారిటీ- ఆఫ్‌ ఇండియా కేంద్రంలో క్రీడాకారిణుల పట్ల కోచ్‌లు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు- వచ్చిన వార్తలు సంచలనం కలిగించాయి. అలాగే, నేర నిరూపణ చేయటంలోనూ పోలీసు యంత్రాంగం తరచూ విఫలమ వుతోంది. సంచలనం కలిగించిన ఆయేషా, రిషితేశ్వరి ఉదంతాలలో నిందితులకు శిక్ష పడలేదు. దర్యాప్తులో వైఫల్యాలు కూడా నేర ప్రవర్తకులకు పరోక్ష ధైర్యాన్నిస్తాయి. ఈ విష సంస్కృతికి అడ్డుకట్ట వేయాలంటే కఠిన శిక్షలు విధించాల్సిందే. మరణశిక్షలకు సైతం వెనకాడరాదు. చిన్నప్పటి నుంచే విలువలతో కూడిన చదువు, జీవితాన్ని మన పిల్లలకు అందించాలి. మన పాఠ్యాంశాలను కూడా మనం మార్చుకోవాల్సి ఉంది. మార్పు అనేది ప్రతి ఒక్కరిలోనూ రావాలి. విలువైన మానవ జీవితానికి సార్థకతను తేవాలి.

Latest News

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News