Friday, July 17, 2026
26.4 C
Hyderabad

జనం పోటెత్తిన వనం!|MEDARAM|SAMMAKKA SARALAMMA|JATHARA

కుంభమేళాను తలపించిన మేడారం ప్రభంజనం

జన జాతర!
కనుచూపు మేరా జనమే
నిండైన ఇలవేల్పుల జాతర
జన సంద్రమైన మేడారం
భారీగా తరలివచ్చిన భక్తులు
పెరిగిన ప్రముఖుల సందర్శనలు
క్యూలైన్లలో గంటలతరబడి నిరీక్షణ
క్యూ లైన్లల్లో స్వల్ప తొక్కిసలాట
పస్రా నుంచి భారీగా ట్రాఫిక్ రద్దీ
కిలో మీటర్ల మేర నిలిచిన వాహనాలు
తిరుగు ప్రయాణంలో జనాలు
పోలీసుల అతిపై భక్తుల ఫిర్యాదులు

నేటి సాయంత్రం తల్లుల వన ప్రవేశం

పుట్ట పగిలినట్లు.. నేల ఈనినట్లు.. సంద్రం సడిలేకుండా ఉప్పొంగినట్లు… మేఘం గర్జించి, వర్షించినట్లు… భక్తి దావానలం దహించినట్లు… సుడిగాలి అడవిని చుట్టేసినట్లు… మేడారం అడవంతా హోరెత్తిన జనం.. జన ప్రవాహ ప్రభంజనం!

మేడారం, జనవరి 30 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
కుంకుమ గురుగులే కుల దైవాలు… వెదురు కర్రలే వెలసిన దేవతలు… గద్దెలే గర్భగుడులు…వృక్షాల నీడలే గుడారాలు కోట్లాది హృదయాల భక్తి పారవశ్యం. సకల జనాలను ఏకం చేస్తున్న మేడారం.
ఒడిబియ్యమే పరమాన్నం.. నెత్తి మీద బోనం.. బెల్లమే తులాభారం, నిలువెత్తు బంగారం.. పసుపు–కుంకుమలే పెట్టుబోతలు.. బట్ట–రైక ముక్కలే చీర సారెలు… శివసత్తుల పూనకాలు, వేడుకోళ్ళు… కోడి పుంజులే ఎదురుకోళ్ళు… కండ్ల చూసే మొక్కుబడులు. తల్లుల పోరాటాలకు పలవరించి, త్యాగాలకు పులకరించి, వన దేవతలకు జనం జేజేలు పలికే అపూర్వ ఆధ్యాత్మిక మహోత్సవం మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర. భళా మరో కుంభమేళా!
జనం భక్తి పారవశ్యంతో వన దేవత, మన దేవత, జన దేవత అంటూ అపార విశ్వాసంతో, అత్యంత భక్తి శ్రద్ధలతో కోట్లాది భక్తుల హృదయాలను ఏకం చేసే ఈ ప్రపంచ ప్రసిద్ధ జాతరకు దేశం నలుమూలలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తజనం మేడారానికి పోటెత్తుతున్నారు. ఆదివాసీ సంప్రదాయాలు, చారిత్రక పోరాటాల, త్యాగాల తల్లులపై ప్రజల నమ్మకం, ఆధ్యాత్మిక విశ్వాసం మేళవించిన ఈ జాతరలో భక్తుల భక్తి చల్లని సంద్రంగా ఉప్పొంగుతోంది.

జంపన్న వాగులో జల స్నానాలు, తల నీలాలు
జంపన్న వాగు పొడవునా జనం పుణ్య స్నానాలాచరిస్తున్నారు. తల నీలాలు సమర్పిస్తున్నారు. శివసత్తులు ఊగుతున్నారు. తడి బట్ట స్నానాలతోనే అమ్మవారి దర్శనాలకు వస్తున్నారు. ఒడి బియ్యం మూట గట్టుకుని, నిలువెత్తు బంగారాన్ని తల మీద మోసుకుంటూ జనం గద్దెల వద్దకు క్యూ కడుతున్నారు.

జనంతో దద్దరిల్లుతున్న గద్దెలు
మేడారం జాతర ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా జనమే. అమ్మవారి నామస్మరణలే మార్మోగుతున్నాయి. క్యూ లైన్లలో భక్తులు శాంతియుతంగా తల్లుల దర్శనానికి నడుస్తున్నారు. గద్దెల వద్ద దర్శనాలు ముగించుకుని, వెంట తెచ్చిన బంగారాన్ని అమ్మలకు సమర్పించి, మొక్కులు తీర్చుకుంటున్నారు.

వన భోజనాలు…
దర్శనాలనంతరం భక్తులు వన భోజనాలు చేస్తున్నారు. వెంట తెచ్చుకున్న మేకలు, గొర్లను అమ్మల పేరున కోసి, అర్పించి, ఆరగిస్తున్నారు. అలా వెళ్ళి.. ఇలా వచ్చే వారికంటే. ఈసారి వనంలోనే రెండు మూడు రోజులు ఉంటున్నారు. చెట్టునీడ, గుడారాలు వేసుకుని, తనివి తీరా, అడవిని ఆస్వాదిస్తున్నారు.

అప్రమత్తంగా అధికార యంత్రాంగం
భారీ భక్తుల రద్దీకి తగ్గట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి భారీ ఏర్పాట్లు చేసింది. కోట్లాది రూపాయలతో శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టింది. వివిధ శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. ట్రాఫిక్ నియంత్రణ, క్యూ లైన్లు, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

వైద్య సిబ్బంది, వాలంటీర్ల సేవలు
జాతర ప్రాంగణం అంతటా వైద్య బృందాలు నిరంతరం సేవలందిస్తుండగా, అత్యవసర చికిత్స కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. క్యూ లైన్ల వద్ద, గద్దెల సమీపంలో వాలంటీర్లు భక్తులకు నీరు, సూచనలు అందిస్తూ సహకరిస్తున్నారు. భక్తుల రద్దీని తట్టుకునేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.

ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు
మేడారం జాతరలో వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి 500 మంది ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు సేవలందిస్తున్నారు. జాతరలో భక్తులకు మార్గనిర్దేశం, క్యూ లైన్లలో సహాయం, జంపన్న వాగు వద్ద భద్రతా సూచనలు, తప్పిపోయిన భక్తులను శిబిరాలకు చేర్చడం వంటి సేవలతో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ప్రముఖుల సందర్శనం
పలువురు ప్రముఖులు సమ్మక్క–సారలమ్మ తల్లులను దర్శించుకుని మొక్కులు సమర్పించారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, గండ్ర సత్యనారాయణ, డీజీపీ శివధర్ రెడ్డి, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ గ్యారత్ వెన్ ఓవెన్ సమ్మక్క–సారలమ్మలకు తులాభారం సమర్పించి దర్శించి, మొక్కులు చెల్లించుకున్నారు.

భక్తుల ప్రశంసలు
ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత జాతరలతో పోలిస్తే ఈసారి దర్శనాలు మరింత సులభంగా, వేగంగా జరుగుతున్నాయని, భద్రత, పారిశుధ్యం, వైద్య సేవలు మెరుగ్గా ఉన్నాయని భక్తులు ప్రశంసిస్తున్నారు.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News