Monday, April 13, 2026
25.7 C
Hyderabad

తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు

సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన బిజి బిజి

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం జపాన్ పర్యటనలో భాగంగా తొలి రోజే కీలక పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టోక్యోలో జపాన్‌కు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ మారుబెని కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకొని, హైదరాబాద్‌ ఫ్యూచర్ సిటీలో ‘నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌’ ఏర్పాటుపై ముఖ్య చర్చలు జరిపారు. దాదాపు రూ. 1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు మారుబెని సిద్ధమైంది. 600 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి పార్కును దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమక్షంలో లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై ప్రభుత్వ అధికారులు, మారుబెని ప్రతినిధులు సంతకాలు చేశారు.

ఈ పార్క్ ద్వారా ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు రావనున్నాయి. దీని ద్వారా రాష్ట్రంలో దాదాపు రూ. 5,000 కోట్లకు పైగా పెట్టుబడులు, 30,000కు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు కలుగుతాయని అంచనా. మారుబెని పార్క్ తెలంగాణలో ఉన్న నైపుణ్యాలను మరింత శక్తివంతం చేస్తూ విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదం చేస్తుందని సీఎం అన్నారు. ఫ్యూచర్ సిటీ దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో సిటీగా అభివృద్ధి అవుతుందని, ఇందుకు మారుబెని మొదటి భాగస్వామిగా ఉండటం గర్వంగా ఉందని పేర్కొన్నారు. జపాన్ – భారత్ మధ్య ఉన్న దోస్తీ కారణంగా పెట్టుబడిదారులు తెలంగాణను తమ స్వదేశంగా భావిస్తున్నారన్నారు.

అలాగే, గురువారం తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్‌లో సోనీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. ప్రత్యేకంగా సోనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందంతో ముఖ్యమంత్రితో పాటు ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సోనీ తయారీ చేస్తున్న కొత్త ఉత్పత్తులు, వారి కార్యక్రమాలను సమగ్రంగా పరిచయం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్న అత్యాధునిక ఫిల్మ్ సిటీ, వీఎఫ్ఐ, యానిమేషన్, గేమింగ్ రంగాలలో ఉన్న అవకాశాలను వివరించారు. ఎండ్ టు ఎండ్ ప్రొడక్షన్ సౌకర్యాలను కలిగి ఉండేలా ఫిల్మ్ సిటీని తీర్చిదిద్దే లక్ష్యాన్ని చెప్పారు. రాష్ట్రాన్ని సాంకేతికత, వినోద రంగాల్లో నూతన శకానికి తీసుకెళ్లే ఈ ప్రయత్నాలు తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించనున్నాయన్నారు.

Latest News

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్-2|HISTORY|ARTEMIS-2

సురక్షితంగా భూమికి చేరిన వ్యోమగాములు చంద్రుడి చుట్టూ చారిత్రాత్మక పది రోజుల యాత్రను ముగించుకుని నాసాకు చెందిన 'ఆర్టెమిస్-2' వ్యోమగాములు శనివారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి చేరుకున్నారు. కాలిఫోర్నియాలోని శాన్టియాగో తీర సమీపంలో పసిఫిక్...

గిది అగ్గిపెట్టేనుల్లా!?|ADUGU TRENDS

గిది నిజ్జంగా అగ్గి పెట్టే! గా ఎండకు ఎండదు. ఆనకు తడవదు. సలికి మండకుండా ఉండదు. జేబుల పెట్టుకుంటే మోటుగుండదు. అరె! మరైతే గిదేం అగ్గిపెట్టే? అని గద అనిపిస్తుంది. కనీ, గిది...

దేశంలో సామాజిక సమస్యలకు పరిష్కారాలేవి!?|EDITORIAL

భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించి 80 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న ఈ సందర్భంలో, సాధించిన విజయాలకన్నా ఎదుర్కొంటున్న సవాళ్ళే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, సామాజిక రంగంలో ఇంకా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News