శ్రీ క్రోధినామ సంవత్సరం–ఉత్తరాయణం
శిశిరఋతువు పాల్గుణమాసం కృష్ణపక్షం
తిధి పాడ్యమి పగలు 01.17 వరకు
ఉపరి విదియ
నక్షత్రం ఉత్తర ఉదయం 09.52 వరకు
ఉపరి హస్త
యోగం గండ పగలు 12.54 వరకు
ఉపరి వృద్ధి
కరణం కౌలవ పగలు 12.52 వరకు
ఉపరి గరజి
వర్జ్యం రాత్రి 07.14 నుండి 08.59
వరకు
దుర్ముహూర్తం ఉదయం 06.25 నుండి
08.00 వరకు
రాహుకాలం ఉదయం 09.00 నుండి
10.30 వరకు
సూర్యోదయం ఉదయం 06.25
సూర్యాస్తమయం సాయంత్రం 06.24
మార్చి 15, 2025, శనివారం నాటి రాశి ఫలాలు
మేషం
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది.
వృషభం
ఆకస్మిక ధన లాభాలు సంభవిస్తాయి. సోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.
మిథునం
ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
కర్కాటకం
ఆదాయం నిలకడగా ఉంటుంది. కోరికలు నెరవేరతాయి. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. దూర ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
సింహం
ఉద్యోగ జీవితం వైభవంగా సాగుతుంది. కొత్త అవకాశాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం.
కన్య
ఆదాయం పెరుగుతుంది. కోరికలు నెరవేరతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
తుల
ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో ఆనంద సమయంలో గడుపుతారు.
వృశ్చికం
జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది. ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.
ధనుస్సు
ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబంలో సంతోషాలు నెలకొంటాయి. ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి.
మకరం
ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి.
కుంభం
ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబంలో సంతోషాలు నెలకొంటాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి.
మీనం
జీవితం వైభవంగా సాగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి.