Friday, September 18, 2026
26.4 C
Hyderabad

సదరు కార్యాలయం వున్న ఏరియా పేరు మారుస్తా.. – సిఎం రేవంత్

తెలంగాణలో ప్రజా గాయకుడిగా, విప్లవ కవిగా పేరుగాంచిన గద్దర్ 77వ జయంతిని శుక్రవారం రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గద్దర్‌పై హృదయపూర్వక నివాళులు అర్పించారు. గద్దర్ చివరి శ్వాస వరకూ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడారని, ఆయన సమాజ హితం కోసం అంకితభావంతో పనిచేశారని సీఎం అన్నారు.

గద్దర్ తనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారని, ప్రతి సందర్భంలో తనను ప్రోత్సహించారని సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. సమాజమే తన కుటుంబంగా భావించి జీవించిన గద్దర్ ఒంటరిగా అనిపించినప్పుడు తనను ఆదరించేవారని, ఆయన మాటలు తనకు ఎప్పుడూ మార్గదర్శకంగా ఉండేవని గుర్తుచేశారు. “నీ బాధ్యత నెరవేర్చు, ప్రజలు నీకు అవకాశం ఇస్తారు” అనే గద్దర్ మాటలు తన రాజకీయ జీవితంలో ఎంతో ప్రభావం చూపాయని ఆయన అన్నారు.

సమాజానికి స్ఫూర్తినిచ్చేలా గద్దర్ పేరిట అవార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. గద్దర్ అవార్డుల బాధ్యతను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించినట్లు ప్రకటించారు. ఏటా గద్దర్ జయంతిని ఘనంగా నిర్వహించడం ద్వారా ఆయనను స్మరించుకుంటామని అన్నారు.

గద్దర్ మృతదేహాన్ని ఎల్బీ స్టేడియానికి తీసుకెళ్లేందుకు గత ప్రభుత్వంలో అడ్డంకులు పెట్టారని సీఎం రేవంత్ మండిపడ్డారు. అయితే ప్రజలందరికీ గద్దర్ చివరి చూపు అందించాలనే ఉద్దేశంతో ఎల్బీ స్టేడియంలో అంతిమ సంస్కారాలకు అవకాశం కల్పించామని వివరించారు.

పద్మ అవార్డుల విషయంపై కూడా సీఎం రేవంత్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి ఐదుగురి పేర్లు సిఫార్సు చేసినట్లు తెలిపారు. గద్దర్, గోరటి వెంకన్న, చుక్కా రామయ్య, అందెశ్రీ, జయధీర్ తిరుమలరావులకు పద్మ పురస్కారాలు ఇవ్వాలని ప్రతిపాదించామని చెప్పారు. పక్క రాష్ట్రాలకు ఐదు అవార్డులు ఇచ్చిన కేంద్రం, తెలంగాణ ప్రతిపాదించినవారికి ఎందుకు అవార్డులు ఇవ్వలేదని ప్రశ్నించారు.

కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. గద్దర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. బీజేపీ కార్యాలయానికి గద్దర్ పేరు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దర్‌ను అవమానిస్తే తగిన గుణపాఠం నేర్పుతామని, ఆయన పేరు అపహాస్యం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

గద్దర్ అవార్డును ప్రతిష్టాత్మకంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ప్రజా ఉద్యమాలకు ఆయన అందించిన సేవలను తరతరాలకు గుర్తు చేసేలా కార్యక్రమాలు చేపడతామని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో, ప్రజా పోరాటాల్లో గద్దర్ చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

Latest News

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News