Thursday, July 30, 2026
23 C
Hyderabad

ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యత

“ఆపరేషన్ సిందూర్” సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి

దేశ భద్రతా పరిస్థితుల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఆపరేషన్ సిందూర్ సమీక్ష సమావేశం నిర్వహించగా…. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ, ఈ సమయంలో రాజకీయాలకు, పార్టీ వ్యవహారాలకు ఏమాత్రం తావు లేదని స్పష్టం చేశారు. ప్రజలంతా దేశ సైన్యంతో ఉన్నామనే బలమైన సందేశాన్ని ఇచ్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని సూచించారు.

ఈ క్రమంలో అత్యవసర సేవల విభాగాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తూ వారంతా పూర్తిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మంత్రులు, ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు విదేశీ పర్యటనలు తక్షణమే రద్దు చేసుకోవాలని సూచించారు. మీడియా లేదా సోషల్ మీడియాలో అసత్య ప్రకటనలు చేసిన ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా హెచ్చరించారు.

ప్రజలతో 24 గంటల పాటు సంప్రదించేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని, కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. అంతేగాక, పాక్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అక్రమంగా నివసిస్తున్న వారిని అదుపులోకి తీసుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

రక్తదానం, అత్యవసర ఔషధాలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్ల అందుబాటు, రెడ్ క్రాస్ సంస్థలతో సమన్వయం వంటి అంశాలపైనా ముఖ్యమంత్రి దృష్టి సారించారు. బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు సిద్ధంగా ఉండేలా చూడాలని, అత్యవసర మందులు సమీకరించాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకల (బెడ్ లు) వివరాలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని అధికారులను ఆదేశించారు.

అలాగే, ఫేక్ న్యూస్ పై ప్రభుత్వం ఉక్కు పాదం మోపనున్నదని సీఎం రేవంత్ హెచ్చరించారు. పౌరులలో ఆందోళన కలిగించే వదంతులను అరికట్టేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు.

హైదరాబాద్ నగరంలో భద్రతను మరింత బలోపేతం చేయాలని, ముఖ్యంగా మూడు కమిషనరేట్ల పరిధిలోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అనుసంధానించాలన్నారు. విదేశీ రాయబార కార్యాలయాలు, ఐటీ కంపెనీలు వంటి ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల్లో భద్రత పెంచాలని, అవసరమైతే పీస్ కమిటీ లతో సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. హిస్టరీ షీటర్లు, పాత నేరస్తులపై పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని సూచించారు.

ఈ సమీక్షలో సీఎం చేసిన సూచనలు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ప్రజల భద్రతకు నిదర్శనంగా నిలుస్తున్నాయని పలువురు అభినందిస్తున్నారు.

Latest News

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News